టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ అనారోగ్యంతో ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.గత కొన్ని రోజుల క్రితం డెంగ్యూ బారిన పడిన అడవి శేష్ కి..రక్తంలో ఉన్న ప్లేట్ లెట్స్ అకస్మాత్తుగా పడిపోవడంతో..సెప్టెంబర్ బ్18 న ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.ఇక అప్పటి నుండి చికిత్స తీసుకుంటున్న ఆయన..సోమవారం ఉదయం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఆ విషయాన్ని అడవి శేష్ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేసారు.

ఈ మేరకు అడవి శేష్  తన ట్విట్టర్ ఖాతాలో..'ఇంటికి తిరిగి వచ్చాను.. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేసాడు. దీంతో ఈ వార్త తెలిసిన అతని అభిమానులు సోషల్ మీడియాలో వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో అడవి శేష్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం హీరోగానే కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఇక విలన్ గా, ఒక రైటర్ గా ఎలా ఎన్నో రకాల టాలెంట్స్ తో తానేంటో నిరూపించుకున్నాడు. ఎప్పుడూ కంటెంట్ బేస్డ్ కథలను,విభిన్నమైన ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటూ ఇండ్రస్టీ లో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని ఏర్పరచుకున్నాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో.

ఇక ప్రస్తుతం అడవి శేష్ 'మేజర్'అనే సినిమాలో నటిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్మేజర్ సందీప్ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇందులో అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.శశి కిరణ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక జిఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు,సోని పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన మేజర్ టీజర్ కి ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ లభించగా ఈ ఏడాది చివరిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: