ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అగ్ర హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో తన కెరీర్లో ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక్.. నటన, డాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింటిలో ది బెస్ట్ ఇస్తూ ఎన్నో రికార్డులు అందుకున్నాడు.ఇక బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి హోస్ట్ గా ఎంతగానో అలరించాడు ఎన్టీఆర్.బిగ్ బాస్ షో తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి.. ఆ షో సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు.

 ఇక ఇదిలా ఉంటె ఎన్టీఆర్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది.గతంలో తన పేరిట ఉన్న రికార్డ్ ని తానే చెరిపేసి ఓ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు యంగ్ ఎన్టీఆర్.ఇక తాజాగా ఎన్టీఆర్  రామరాజు ఫర్ భీమ్ వీడియో 1.5 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుంది.ఇక ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక వీడియో రామరాజు ఫర్ భీమ్ కావడం విశేషం.అంటే ఇప్పటివరకు ఏ అగ్ర హీరోకి దక్కని రికార్డ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి దక్కింది. దీంతో ఇప్పుడు నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఇక రామరాజు ఫర్ భీమ్ వీడియో విడుదలైన కేవలం 24 గంటల్లోనే 14.14 మిలియన్ వ్యూస్ ని అందుకుంది.ఇక టీజర్ లో రాజమౌళి ఎన్టీఆర్ ని అద్భుతంగా చూపించాడు.

ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో పులితో చేసే ఫిట్ సీన్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేలా ఉంటుందని..అంతేకాకుండా ఆడియన్స్ ఊహకి అందని ట్విస్టులతో ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. అక్టోబర్ 13 న విడుదల కావాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది.ఇక ఎన్టీఆర్ తో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్నారు.ఇక వచ్చే ఏడాది ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ముందు ముందు ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఇంకెలాంటి రికార్డులు అందుకుంటారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: