ఇటీవలే కాలంలో రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ రానుందనే వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ చిత్ర కథపై మళ్లీ పని చేయగా ఓ మంచి కథ దొరికిందని ఇటీవలే విజయేంద్ర ప్రసాద్ చెప్పగా అప్పటినుంచి ఈ సినిమా సీక్వెల్ ఉందనే వార్తలు రావడం ఎక్కువయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ ద్విపాత్రాభినయం లో తెరకెక్కిన విక్రమార్కుడు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన ఈ సినిమాకు సీక్వల్ రావాలని డిమాండ్ అప్పట్లోనే ఉండగా దర్శక హీరోలు ఇద్దరు తమ సినిమాలతో బిజీ కావడం వల్ల ఆ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే లేకపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ సినిమా సీక్వెల్ తెరపైకి వచ్చింది. అయితే  ఈ సినిమా ను రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేయబోతున్నాడు అని వార్తలు రాగా ఆయన మహేష్ తో సినిమా ఉండడం కావడంతో మరో దర్శకుడికి చేతికి వెళ్ళింది అని వార్తలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలోనే ఇటీవలే సీటిమార్ ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సోషల్ మీడియాలో వార్తలు రావడం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం సంపత్ నంది కూడా ఈ సినిమా చేయట్లేదు అని తెలుస్తుంది. ఆయన ఓ పాన్ ఇండియా సినిమా చేసే విధంగా సన్నాహాలు చేసుకుంటున్నాడు. అని తెలుస్తోంది. దీంతో విక్రమార్కుడు సినిమా కు దర్శకుడు వెతకడం ప్రేక్షకుల వంతు అయ్యింది. అంత పెద్ద మాస్ చిత్రాన్ని ఓ చిన్న దర్శకుడు హ్యాండిల్ చేయడం అంటే కష్టం. పెద్ద దర్శకులు అందరూ తమ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వాయిదా పడక తప్పదు అని అనిపిస్తుంది. మరి రాజమౌళినే ఈ సినిమాని తెరకెక్కిస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: