అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం లో నటించగా ఆయనకు భారీ హిట్ చిత్రంగా ఇది నిలవగా ఇది ఆయన కెరీర్ లోనే భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.  2016 లో నాగార్జున అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా కు సీక్వెల్ గా ఇప్పుడు బంగార్రాజు అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కూడా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం.

కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమా లాగానే సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలోని హంగులను దాని కంటే ఏ మాత్రం తక్కువ గా ఉండకుండా చూసుకుంటున్నారు యూనిట్. ఆ సినిమాలో టైటిల్ సాంగ్ కోసం అనసూయ, హంసా నందిని వంటి అందాల ముద్దుగుమ్మలను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో కూడా టైటిల్ సాంగ్ ను అదిరిపోయే రేంజ్ లో చేయనున్నారట. దానికోసం ముగ్గురు ముద్దుగుమ్మలు నాగార్జున ఇప్పటికే సెలెక్ట్ చేశాడు అని చెబుతున్నారు.

రంభ ఊర్వశి మేనక అంటూ సాగే ఈ పాట ముగ్గురు అప్సరసలతో కలిసి బంగార్రాజు చిందులు వేయనున్నాడట. ఈ సినిమాలో నాగచైతన్య కూడా మరో హీరో పాత్ర చేస్తున్నాడు. ఈయన సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తూండగా నాగార్జున నాగచైతన్య కలిసి ముచ్చటగా మూడో సారి నటించబోతున్నారు. నాకు తెలిసిన రమ్యకృష్ణ నటిస్తూ ఉండగా ఈ టైటిల్ సాంగ్ లో రంభ గా వేదిక ఊర్వశిగా మీనాక్షి దీక్షిత్ మేనక గా బెంగాలీ భామ దర్శనం దర్శనం ఇవ్వబోతున్నారట. ఇక ఇటీవలే లవ్ స్టోరీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నాగచైతన్య ఈ చిత్రంలో ఎంతో హుషారుగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అటు నాగార్జున కూడా ఘోస్ట్ అనే చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: