బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 5 మొదలై మూడు వారాలు పూర్తయ్యాయి.మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 5 ప్రారంభమైంది. అందులో మూడు వారాలకు గానూ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి.. హౌస్ నుండి బయటికి వెళ్లిపోయారు.అయితే ఈ ముగ్గురు కంటెస్టెంట్స్  కూడా స్టేజ్ పై చెప్పింది ఒక్కటే.షణ్ముక్, సిరి ఇద్దరూ కలిసి గేమ్ అడవద్దని.అసలు నిజంగానే వీళ్ళిద్దరూ కలిసి గేమ్ అడుతున్నారా అనేది ఇప్పుడు ఆడియన్స్ లో సందేహంగా మారింది.నిజానికి మొదటి వారంలో ఎలిమినేట్ అయిన యూట్యూబర్ సరయు..షణ్ముక్ అండ్ సిరి వీళ్ళిద్దరూ దేనికొచ్చారు. కలిసి గేమ్ ఆడటానికా అంటూ కామెంట్స్ చేసింది.

ఆ తర్వాత రెండో వారానికి గాను ఎలిమినేట్ అయిన ఉమాదేవి సైతం ఇదే ఇష్యుని స్టేజ్ పైన చెప్పింది.దీంతో షణ్ముక్ తన గేమ్ ని సోలో గా ఆడాలని డిసైడ్ అయిపోయాడు.ఈ నేపథ్యంలో టాస్క్ జరుగుతున్నప్పుడు ఇదే విషయాన్ని జెస్సి తో చెప్పాడు షణ్ముక్.సిరికి దూరంగా ఉంటానని,నా బెడ్ కూడా చేంజ్ చేసుకుంటానని చెప్పాడు. అదే విధముగా సిరితో మాట్లాడటం మానేశాడు.దీంతో సిరి షణ్ముక్ వెంట పడింది.ఆ తర్వాత బాధ పడింది. ఇది కాస్త నాగార్జున గారి కంట పడింది.దీంతో వీళ్ళ పంట పండి.. మరోసారి ఇద్దరూ కలిసి పోవడం జరిగింది.ఇక ఈసారి లహరి కూడా..స్టేజ్ పైన చెప్పను..కానీ,మీరిద్దరూ కలిసి గేమ్ ఆడొద్దు అంటూ షణ్ముక్ కి ఓ హింట్ ఇచ్చి స్టేజి పైకి వచ్చింది.

ఇక మరోసారి ఇదే టాపిక్ ని తీసింది లహరి.ఇక ఇప్పుడు లహరి కూడా ఈ.మాట ఎందుకు అన్నది అనేది ఇప్పుడు వైరల్ గా మారింది.నిజానికి లహరి నామినేషన్స్ కి వచ్చింది షణ్ముక్ ఓటు వేయడం వల్లనే.లేదంటే ఈమె రెండే ఓట్లతో సేఫ్ అయ్యేది.అయితే షణ్ముక్ ..లాహరిని నామినేట్ చేస్తూ.. నీలో బెస్ట్ చూడాలని అనుకుంటున్నా.నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని అంటాడు. అయితే అంతకుముందు సిరి కూడా ఇదే రీజన్ తో లాహరిని నామినేట్ చేసింది.దీన్ని బట్టి చూస్తే సిరి చెప్పిన కారణమే షణ్ముక్ కూడా చెప్పాడా? లేక ఇద్దరూ కలిసే ప్లాన్ ప్రకారం గేమ్ అడుతున్నారా అనేది సందేహంగా మారింది.మరి ఈ వారం అయిన5ఈ2ఇద్దరూ తమ గేమ్ ని సెపరేట్ గా ఆడతారా?లేక కలిసి ఆడతారా?అనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: