తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితుడు అక్కినేని నాగేశ్వరరావు. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. నాటకాల ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించిన నాగేశ్వరరావు ఎన్నో సినిమాల్లో నటించారు. ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగారు. అయితే చిన్నతనం నుంచే నాగేశ్వరరావుకు నాటకాలంటే పిచ్చి ఎక్కువ. సినీ ఇండస్ట్రీకి పరిచయం కాకముందు నాటకాల్లో నటించేవారు. ఇందులో స్పెషల్ ఏం ఉందని అనుకుంటున్నారా..? అయితే ఇక్కడే ఒక్క ప్రత్యేకత ఉంది. నాగేశ్వరరావు నాటకాలు వేసేటప్పుడు అమ్మాయిల పాత్రల్లో కూడా నటించేవారు.

అమ్మాయి వేషధారణలో అక్కినేని నాగేశ్వరరావుకు ఎంతో క్రేజ్ ఉండేది. లేడీ గెటప్‌లో నాటకం వేసేటప్పుడు స్టేజీలు దద్దరిల్లేవని టాక్. మొదటిసారి లేడీ గెటప్ వేసినప్పుడు అమ్మాయి పాత్రలో అక్కినేని ఎంతో అందంగా కనిపించారంట. నాగేశ్వరరావు లేడీ గెటప్‌లో ఉన్నప్పుడు ఒక వ్యాపారవేత్త చూసి.. చాలా అందంగా ఉంది. ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని అన్నారంట. చివరకు లేడీ గెటప్ అని తెలిశాక నవ్వుకున్నారంట. అంతలా ఆ పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు లీనమయ్యేవారు.

అక్కినేని నాగేశ్వరరావు సినీ పరిశ్రమలో ఏకంగా 75 ఏళ్లు కొనసాగారు. పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలల్లో నటించారు. కుటుంబ కథ, ప్రేమ కథా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నారు. దేవదాసు, మూగమనుషులు వంటి బ్లాక్ బస్టర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నారు. బతికున్న సమయంలో ఆయన పడిన కష్టాల గురించి ఆయనే చెప్పుకున్నారు. నాగేశ్వరరావుకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి చనిపోయారు. తల్లి, పెద్ద అన్నయ్య ప్రోత్సాహంతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.


పేద కుటుంబం కావడంతో చిన్నచిన్న పనులు చేసుకుంటూ చదువుకునేవారు. స్కూల్‌లో చదిలేటప్పుడు నాటకాలు వేసేవారని, అలా నాటకాల వైపు దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. సత్య హరిశ్చంద్ర నాటకంలో మొదటిసారిగా చంద్రమతిగా లేడీ గెటప్ వేశారంట. ఈ నాటకం ప్రేక్షకులకు ఎంతగానో అలరించిందంట. అక్కినేని నాగేశ్వరరావు ఆడవేషం వేసినప్పుడు నటనకు రూ.100 నుంచి 200 వచ్చాయన్నారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి కోట్లల్లో సంపాదనను ఆర్జించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: