విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న లైగర్ సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ ఈరోజు నాలుగు గంటలకు జరిగింది. ముందు నుంచి చిత్ర బృందం చెప్పినట్లుగానే ఈరోజు నాలుగు గంటలకు విజయ్ దేవరకొండ తన సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశాడు. 125 కోట్ల భారీ బడ్జెట్ తో పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండగా పాన్ ఇండియా సినిమా గా ఇది తెరకెక్కుతు ఉండడం విశేషం. హిందీ తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంపై మొదటి నుండీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తూ ఉండగా రమ్య కృష్ణ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ గోవాలో జరుపుకుంటుంది.  విదేశీ ఫైటర్స్ తో అద్భుతమైన పోరాట దృశ్యాలను ఈ షెడ్యూల్ లో చిత్రబృందం తెరకెక్కిస్తుదట. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తూ ఉండగా బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. 

ఇకపోతే ఈ చిత్రంలో మైక్ టైసన్ కూడా నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. విజయ్ దేవరకొండ యూట్యూబ్ ఛానల్ లో దీనికి సంబంధించిన ప్రకటన చేశాడు. ఒక అద్భుతమైన వీడియో ని తయారు చేసి తమ సినిమాలో మైక్ టైసన్ ఉన్నట్లు వారు వెల్లడించారు. బాక్సింగ్ దిగ్గజం అయిన తైసన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అనే విషయం తెలియడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్ దేవరకొండ మరియు మైక్ టైసన్ ల మధ్య ఫైటింగ్ సీన్ ఉండబోతుంది అని ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇక ఈ అప్డేట్ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గతంలో ఈ సినిమాను రెండు వందల కోట్లకు ఓటీటీ కొనుగోలు చేసిందని వార్తలు రాగా విజయదేవరకొండ అంతకుమించి థియేటర్లలో వసూలు చేస్తామని చెప్పి ఈ సినిమాపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: