ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. నాని నటించిన జెర్సీ సినిమా రీమేక్ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాడు.. డిసెంబర్ 31వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు బాలీవుడ్ హీరో షాహిద్ వెల్లడించాడు. ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను రీమేక్ చేయడానికి నాచురల్ స్టార్ నాని హీరో కారణమని తెలియజేశాడు.. ఈ సినిమా చూసినంత సేపు ఏడుస్తూనే ఉన్నాను.. నాని చాలా అద్భుతంగా నటించాడు.. ఇక కచ్చితంగా చెప్పాలంటే ఇప్పటివరకు నాకు నచ్చిన ఫేవరెట్ డైరెక్టర్లు ఎవరూ లేరు.. మొదటిసారి జెర్సీ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నా ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయారు. అని తెలిపాడు.

ఇక అంతే కాదు సమంత గురించి  నెటిజన్లు  అడిగిన ప్రశ్నకు షాహిద్ కపూర్ ఇలా సమాధానం ఇచ్చాడు..సమంత  నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ టూ సిరీస్ చూసి ఎంతో పొంగిపోయాను.. ఇక ఆమె నటనకు ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే.. ఇక నేనెంత.. ఆమె నటనకు ఫిదా అయ్యి , యాక్టింగ్ కి నేను  లవ్ లో పడిపోయాను.. ఫ్యూచర్ లో నాతో నటించడానికి సమంత ఒప్పుకుంటే, తప్పకుండా తనతో కలిసి నటిస్తాను అని తెలిపాడు.


అంతేకాదు హృతిక్ రోషన్ స్క్రీన్ పై చూడడం అంటే తనకు చాలా ఇష్టమని , కబీర్ సింగ్ నటించిన సూర్యవంశీ  సినిమా తో మరోసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని , ప్రతి ఒక్కరూ థియేటర్లకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.. ఇక షాహిద్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో తెలుగులో సంచలన విజయం సాధించిన జెర్సీ సినిమా రీమేక్ చేశాడు . ఇకపోతే తెలుగులో నాని సంచలన విజయం అందుకున్నాడు.. ఇక హిందీలో షాహిద్ కపూర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో మనం వేచి చూడాల్సిందే.మరింత సమాచారం తెలుసుకోండి: