బాహుబలి సినిమాతో రాజమౌళి సరేంజే మారిపోయింది. ఈ సినిమా రెండు భాగాలను పూర్తి చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నాడు జక్కన్న.ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అలా కాకుండా తక్కువ సమయంలో పూర్తి చేయాలని రంగంలోకి దిగినా.. కరోనా మరియు ఇతరత్రా కారణాల వల్ల అది వీలవ్వలేదు.ఇప్పటికే ఈ సినిమా పలు మార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.అయితే చివరగా అక్టోబర్ 13 దసరా కానుకగా ఈ సినిమాని కచ్చితంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది.కానీ దసరాకి కూడా ఈ సినిమాని విడుదల చేయడం లేదు.ఈ విషయాన్ని కూడా స్వయంగా జక్కన్న అండ్ టీమ్ తెలియజేసారు.

ఇక ఈ సినిమాకి విడుదల తేది ని ఫిక్స్ చేయడం రాజమౌళికి చాలా పెద్ద తలనొప్పిగా మారింది.ఎందుకంటే దీపావళితో మొదలు పెడితే వచ్చే వేసవి వరకు అన్ని ముఖ్యమైన వారాలకు ఇతర సినిమా రిలీజ్ లు కన్ఫర్మ్ అయిపోయాయి.ఇప్పుడు ఇదే ఆర్ ఆర్ ఆర్ కి ఇబ్బందిగా మారింది.ఇటీవల ప్రచారం జరుగుతున్నట్లు వచ్చే ఏడాది జనవరి రెండో వారానికి ఈ సినిమాను రిలీజ్ చేద్దామని అనుకుంటే..దానికి ముందు వారల్లోనే జెర్సీ,83 లాంటి బాలీవుడ్ బడా సినిమాలున్నాయి.ఇక తర్వాత వారం తెలుగులో మూడు బడా చిత్రాలు ఉన్నాయి.పోనీ వేసవికి వెళదాం అంటే  దాదాపుగా ప్రతీ వారానికి ఓ పెద్ద సినిమా బుక్కైపోయింది.

ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా వేసవి విడుదలే కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక మార్చి చివరి వారంతో స్టార్ట్ చేస్తే..షంషేరా,భూల్ బులయ్య2, కేజీఎఫ్2,మే డే, హీరో పంటి 2, లాంటి బాలీవుడ్ క్రేజీ సినిమాలు వరుసగా రిలీజ్ లు ఫిక్స్ చేసుకున్నాయి.ఇక వీటి మధ్య 'ఆర్ ఆర్ ఆర్' ని ఎక్కడ దించాలో రాజమౌళికి అర్థం కాని పరిస్థితి.ఒకవేళ వాటికి పోటీగా ఏదైనా వారానికి రిలీజ్ ఫిక్స్ చేస్తే..దసరాకు 'మైదాన్' కి పోటీగా ఆర్ ఆర్ ఆర్ ని నిలబెట్టినందుకు ఇప్పటికే బోణి కపూర్ రాజమౌళిని విమర్శించారు.కాబట్టి "ఆర్ ఆర్ ఆర్" కి సరైన రిలీజ్ డేట్ ని ఎంచుకోవడం మన జక్కన్న కి పెద్ద తలనొప్పిగా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: