సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు, సంగీత దర్శకులు, దర్శకులు, నిర్మాతలు పరిచయమవుతారు. తమ సొంత బ్యానర్‌పై కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేసిన వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. తమ మొదటి సినిమాతోనే బాగా పాపులర్ అయిన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. లేదా ఒక పాపులర్ సినిమాలోని తన పాత్రకున్న పేరుతో పాపులర్ అయిన వాళ్లను కూడా మనం చూసి ఉంటాం. ఇలా వారు తమ పేరు ముందు పాపులర్ పాత్ర పేరును పెట్టుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో హాస్యనటుడు కొల్లూరి చిదంబరం కూడా ఒకరు.

 

కొల్లూరి చిదంబరంను.. కళ్ల చిదంబరంగా కూడా పిలుస్తుంటారు. సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ కళ్లతోనే అని.. తన కళ్లు తనకు అదృష్టం చిదంబరం చెబుతుంటాడు. చిదంబరం 1945 అక్టోబర్ 10వ తేదీన విశాఖ పట్నంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాల మీద మక్కువ ఎక్కువే.. అందుకే నాటక రంగం ద్వారానే ఇండస్ట్రీలో అడుగు వేశారు. తనదైన శైలీలో ఎన్నో సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.


వాస్తవానికి గతంలో చాలా మంది నటీనటులు నాటక రంగం నుంచే సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కళ్లు చిదంబరం కూడా నాటక రంగంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాటకరంగం నుంచి వచ్చిన నటీనటులు సినీ ఇండస్ట్రీలో బాగానే రాణించారు. నటుడిగా, దర్శకుడిలా ఇలా అనేక రంగాల్లో సెటిల్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కళ్లు చిదంబరం అమ్మోరు చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ద్వారా చిదంబరానికి హాస్యనటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అమ్మోరు చిత్రంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు.


హాస్యనటుడిగా కొనసాగిన చిదంబరం దాదాపు తెలుగు సినీ పరిశ్రమలో 300లకు పైగా సినిమాలు నటించారు. అమ్మోరు, చంటి, మనీ, పెళ్లి పందిరి, గోల్‌మాల్ గోవిందం, పవిత్ర బంధం తదితర సినిమాలో అద్భుత ప్రదర్శనను ఇచ్చారు. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న చిదంబరం.. చనిపోయేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన కళ్లకు పరీక్షలు చేయించుకుని చనిపోతానన్న తన ఆశ నిరాశగానే మిగిలింది. విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: