ఇప్పటి జనరేషన్ హీరోలు సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేయడానికి తెగ కష్టపడిపోతుంటారు. ఒక సినిమా షూట్ లో పాల్గొని.. మరో సినిమా షూట్ కు వెళితే.. వేరియేషన్ చూపించడం కొంతవరకు కష్టమే. అలాంటిది పదుల సంఖ్యలో సినిమాల్లో నటిస్తూ తన టాలెంట్ చూపిస్తున్నాడు విజయ్ సేతుపతి. చాలా మంది హీరోలు సరైన కథలు దొరకడం లేదనీ..  దర్శకులు స్పీడ్‌గా సినిమాలు తీయడం లేదనే కామెంట్స్‌ కూడా వినిపిస్తుంటాయి. అయితే విజయ్ సేతుపతి మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా 14 సినిమాలతో బిజీగా ఉన్నాడు.

విజయ్‌ సేతుపతిలా యాక్టింగ్‌ చేయడం కొంచెం కష్టమైనా ప్రయత్నం చేయొచ్చు గానీ.. ఈ హీరోలా స్పీడ్‌గా సినిమాలు చేయడం మాత్రం ఈ జనరేషన్‌ స్టార్స్‌కి చాలా కష్టం అంటున్నారు కోలీవుడ్‌ జనాలు. పైగా సినిమాలు, వెబ్ సీరీసులు, టీవీ షో హోస్టింగ్‌ ఇలా మూడు భిన్నమైన ప్లాట్‌ఫామ్స్‌ని హ్యాండిల్ చేయడం అందరికీ సాధ్యం కాదని చెబుతుంటారు.  

విజయ్‌ సేతుపతి తమిళ్‌లో మాత్రమే కాదు తెలుగు, మళయాళీ హిందీల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా, సపోర్టింగ్‌ ఆర్టిస్ట్‌గా మొత్తం 14 సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటితోపాటు హిందీలో ఒక వెబ్‌ సీరీస్‌ కూడా చేస్తున్నాడు. ఇక సీరీసులు, సినిమాలతో పాటు తమిళ్లో మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్‌కి హోస్టింగ్‌ కూడా చేస్తున్నాడు సేతుపతి.

విజయ్ సేతుపతి వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తున్నాడని తమిళ జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు.  సేతుపతికి రోజుకి 24 గంటలు కాకుండా 48 గంటలు ఏమైనా ఉన్నాయా అని మాట్లాడుకుంటున్నారు. అయితే సేతుపతికి చాలా లేట్‌గా స్టార్డమ్‌ వచ్చింది. థర్టీ ఫైవ్‌ ప్లస్‌లో హీరో అయ్యాడు. అవకాశాల్లేనప్పుడు లేవని బాధపడ్డాం. ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోవడం ఎందుకని వరుస సినిమాలు చేస్తున్నాడు సేతుపతి. మొత్తానికి విజయ్ సేతుపతి వరుస సినిమాలతో ప్రేక్షకుల్లో పండుగ వాతావరణం సృష్టిస్తున్నాడు.చూద్దాం.. ఈ14 సినిమాల్లో ఏవి హిట్ అవుతాయో.. ఏవి ఫట్ అవుతాయో.. అన్నీ మంచి టాక్ సంపాదించుకోవాలని ఆశిద్దాం.

 




మరింత సమాచారం తెలుసుకోండి: