టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ద‌ర్శ‌కుడు క్రిష్ త‌న సినిమాల‌ను ఎంత హృద్యంగా చిత్రీక‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క ర్లేదు. ఆయ‌న ఓ క‌థ‌ను ఎంచుకున్నారంటే అందులో ఏదో నావెల్ పాయింట్ ఖ‌చ్చితంగా ఉండి తీరాలి. మ‌హానాయ కుడు, క‌థా నాయ‌కుడు క‌థ‌ల‌ను వ‌దిలేస్తే క్రిష్ తీసిన సినిమాలు అన్ని మ‌న‌స్సును ఎంత‌లా ట‌చ్ చేస్తాయో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సి న అవ‌స‌రం లేదు. తాజాగా ఓ న‌వ‌ల ఆథారంగా మెగా మేన‌ళ్లుడు ఉప్పెన హీరో వైష్ణ‌వ్ తేజ్‌తో క్రిష్ తెర‌కెక్కిస్తోన్న సినిమా కొండ‌పొలం.

ఈ కొండ‌పొలం సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ గ్లింప్స్‌, స్టిల్స్ తోనే ఎంతో ఆస‌క్తి రేపిన క్రిష్ అంచ‌నాలు ఒక్క‌సారిగా పెంచేశారు. ఈ క్ర‌మంలోనే ఈ రోజు ఈ సినిమా నుంచి ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొత్తం 2.46 నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్ చూడ‌డానికి అయితే బాగానే ఉంది. కొండ చ‌రియ‌ల్లో గొర్రెలు మేపేందుకు అష్ట క‌ష్టాలు ప‌డే హీరోయిన్‌.. చ‌దువుకుని ఉద్యోగం లేక మంద‌ను మేపే హీరో.. మ‌ధ్య‌లో గొర్రెల‌ను చంపే పులి.. వీరిని దోచుకునే దొంగ‌లు లాంటి ఇంట్ర‌స్టింగ్ అంశాలు ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇక హీరో, హీరోయిన్ల ప్రేమ స‌రే స‌రి.. ! ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ చాలా ఎఫెక్టి వ్‌గా ఉంటాయ‌ని ముందు నుంచి చెప్పారు. కానీ అవేవి లేవు. పైగా ఆఫ్ బీట్ డైలాగులే ఎక్కువుగా ఉన్నాయి. ఇక ఉప్పెన‌తో మెప్పించిన వైష్ణ వ్ తేజ్ ఈ ట్రైల‌ర్లో చెప్పిన డైలాగులు చూస్తుంటే ఆయ‌న పాఠాలు చెప్పిన‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు.

ఇక వైష్ణ వ్ న‌ట‌న‌లో హుషారు మిస్ కావ‌డంతో పాటు స‌రైన ఎక్స్ ప్రెష‌న్స్ అయితే లేవ‌నే అంటున్నారు. అడ‌విలో విజువ‌ల్స్ కూడా మ‌రీ అంత గొప్ప‌గా లేవ‌న్న టాక్ ఉంది. మ‌రి సినిమాను క్రిష్ ఎంత‌లా రంజిప చేస్తారో ?  చూడాలి.



 

మరింత సమాచారం తెలుసుకోండి: