టాలీవుడ్ సినిమాకి ఊపిరి అందించిన సినిమా గా అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా ను అభివర్ణిస్తున్నారు సినిమా పండితులు.. ఎందుకంటే గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో వచ్చిన సినిమా వచ్చినట్లు ప్రేక్షకులను నిరాశ పరచడంతో లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించడమే కాకుండా ఇప్పటి వరకు థియేటర్లకు రాని వారిని కూడా తిరిగి థియేటర్ లలో కి రప్పిస్తుంది. అందుకే  ఈ లవ్ స్టోరీ సినిమా తెలుగు సినిమా గతిని మార్చిన సినిమాగా చెబుతున్నారు.

నిజానికి రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి తెలుగు సినిమా ఇండస్ట్రీ పై భారీగా ఎఫెక్ట్ చూపించింది. ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు పూర్తిగా దూరమైపోయారు. దానికి తోడు ఓటీటీ పరిశ్రమ కూడా బాగా డెవలప్ అయిపోవడంతో అందరూ ఇంట్లోనే ఉండి సినిమాలు చూడడం మొదలు పెట్టారు.  అయితే ఒకే ఒక మంచి సినిమా తప్పకుండా అందరినీ మళ్లీ థియేటర్లకు రప్పిస్తుంది అని ఎదురు చూసిన సినిమా వారికి ఒక్క సినిమా కూడా హిట్ ఇప్పటివరకు తగలక పోవడం వారిని ఎంతగానో నిరాశపరుస్తూ వచ్చింది.

 అయితే ఇటీవలే వచ్చిన సీటీ మార్ చిత్రం పర్వాలేదనిపించు కోగా ప్రేక్షకులు మాత్రం సినిమా థియేటర్లకు రాలేకపోయారు. దాంతో మరొక సినిమా ఇప్పుడు హిట్ కొట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అలా వెనువెంటనే వచ్చిన లవ్ స్టోరీ చిత్రం మొదటి రోజు నుంచే మంచి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోగా ఫ్యామిలీ ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించడం లో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా అందరినీ ఎంతగానో మెప్పిస్తుండగా అలాంటి సినిమా ఇప్పుడు మూడు రోజులలో 50 కోట్ల కలెక్షన్లు దాటడం ఒక్కసారిగా తెలుగు సినిమా పరిశ్రమ ఊపిరి వచ్చినట్టు అయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: