సూపర్ స్టార్ క్రిష్ణకు అందుకే అంత పేరు. ఆయన మూడు వందల యాభైకి పైగా సినిమాలు చేసినా కూడా ఎక్కడా ఏ నిర్మాతనూ బాధ పెట్టిన దాఖలా లేదు. పైగా ఆయన నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో క్రిష్ణ కాల్షీట్ దొరికితే చాలు ఆ నిర్మాత పంట పండినట్లే అని భావించేవారు.

ఏడాదికి పన్నెండుకు పైగా సినిమాలు చేసే ఏకైక హీరో క్రిష్ణ అంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ పక్కన పెడితే క్రిష్ణతో పాతిక దాకా వరసబెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు ఉన్నారు. అంటే వారికి క్రిష్ణకు ఉన్న బాండేజి ఎలాంటిదో అర్ధం చేసుకోవాలి. ఒకసారి క్రిష్ణతో సినిమా తీసిన నిర్మాత మరో హీరోను కూడా ఎరగరు అని చెప్పాలి.

ఇక క్రిష్ణ కూడా ఇబ్బందులో ఉన్న నిర్మాతలను చేరదీసి వారికి సినిమాలు చేసి పెట్టేవారు. అలా ప్రముఖ నిర్మాత కౌముది మూవీస్ అధినేత ఎమ్మెస్ రెడ్డి కి కూడా క్రిష్ణ ఒక దశలో గొప్ప మేలు చేసి పెట్టారు. అప్పటికి ఎమ్మెస్ రెడ్డి ఎన్నో సినిమాలు తీసి అవి సరిగ్గా ఆడక ఇబ్బందులో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎమ్మెస్ రెడ్డి హిట్ చూసి నాటికి రెండు దశాబ్దాలు అయింది. అటువంటి సమయంలో క్రిష్ణ ఎమ్మెస్ రెడ్డిని పిలిచి మీకో సినిమా చేస్తాను అని చెప్పారుట.

అలా 1985లో నిర్మాణం జరుపుకున్నదే పల్నాటి సింహం. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీని ఎ కోదండ రామిరెడ్డి దర్శకత్వంలోరూపు దిద్దుకుంది. ఈ మూవీలో కధాంశంతో పాటు, పాటలు కూడా సూపర్ హిట్. ఇక ఈ సినిమా వంద రోజులు ఆడిన తరువాత జరిగిన వేడుకలో నిర్మాత  ఎమ్మెస్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ తనకు హిట్ అన్న  రుచి చూపించిన హీరో క్రిష్ణ అని ఆయన్ని కీర్తించారు. మొత్తానికి క్రిష్ణ చేసిన మేలు ఎమ్మెస్ రెడ్డి ఎప్పటికీ మరచిపోలేదు. దటీజ్ క్రిష్ణ.



మరింత సమాచారం తెలుసుకోండి: