స‌హ‌జంగా ఏ హీరో అయినా హిట్ సినిమా చేసినా.. సూప‌ర్ హిట్ సినిమా చేసినా వాటిని ట్రోల్ చేయ‌డం సినీ అభిమానుల‌కు, ఫ్యాన్స్‌కు మంచి స‌ర‌దాగా ఉంటుంది. ఈ సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకుంది.. ఈ సినిమా ప‌దేళ్లు.. ఇర‌వై ఏళ్లు పూర్తి చేసుకుంద‌ని నాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే త‌మ హీరోలు చేసిన కొన్ని డిజాస్ట‌ర్ సినిమాల‌ను కూడా ఆ సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు ఓ ఆటాడు కుంటూ ఉంటారు. అయితే కొంద‌రు హీరోలు చేసిన ఘోర‌మై న డిజాస్ట‌ర్ల‌ను ప‌దే ప‌దే గుర్తు చేసుకుని ట్రోల్ చేస్తూ ఉండ‌డం అప్పుడ‌ప్పుడు జ‌రుగుతూ ఉంటుంది.

మ‌హేష్ బాబు ఎన్ని సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలు చేసినా కూడా కొన్ని ఘోర‌మైన డిజాస్ట‌ర్లు ఇచ్చాడు. వాటిల్లో బాబి - స్పైడ‌ర్ - బ్ర‌హ్మోత్స‌వం ఉంటాయి. ఈ మూడు సినిమాల‌ను ఫ్యాన్స్ ఎప్ప‌ట‌కీ గుర్తు చేసుకుని మ‌రీ మ‌హేష్‌ను తిట్టి పోస్తూ ఉంటారు. అస‌లు మ‌హేష్ ఈ సినిమాల‌ను ఎందుకు ఒప్పుకున్నాడో త‌మ‌కు ఇప్ప‌ట‌కీ అర్థం కాద‌ని చెపుతూ ఉంటారు.

తాజాగా మ‌హేష్ న‌టించిన స్పైడ‌ర్ సినిమా 4 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీంతో మ‌హేష్ అభిమానులు 4ఇయర్స్ ఆఫ్ స్పైడర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూనే.. తమ నిరసనను కూడా తెలియజేస్తూ మురుగ‌దాస్‌ను తిడుతున్నారు. ఆ స‌మ‌యంలో మ‌హేష్‌కు ఒక్క హిట్ వ‌స్తే మ‌నోడి రేంజ్ మ‌రోలా ఉండేద‌ని.. ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చిన ఈ సినిమాతో మ‌హేష్ కెరీర్‌ను పాతాలంలో ప‌డేశాడ‌ని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు అస్స‌లు చేయ‌వ‌ద్ద‌ని.. ఇక‌పై అయినా మ‌హేష్ డైరెక్ట‌ర్ ను చూసి కాకుండా.. క‌థ‌ను చూసి ఓకే చేయాల‌ని కోరుతున్నారు.


ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అలాగే ఎస్ జే సూర్య ఈ సినిమాలో విలన్ గా నటించి..సినిమాకి స్పేషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా ఆయన ఎక్స్ ప్రెషన్స్  సినిమాకే హైలెట్ గా నిలిచాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: