2017 లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువె. తెలుగులో ఈ సినిమా పెద్ద సెన్సేషన్. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అర్జున్ రెడ్డి పాత్రలో జీవిస్తే సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని మాస్టర్ పిస్ గా మార్చారు. అయితే ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ కి ఒక మంచి నటుడిని పరిచయం చేసింది అతనే రాహుల్ రామ కృష్ణ . ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ఫ్రెండ్ గా ఆయన నటన సూపర్బ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఆయనకి వరసగా చాలా ఆఫర్స్ వచ్చాయి.

అందులో కమెడియన్ గా చాలా సినిమాల్లో మంచి పెరు కూడా వచ్చింది. జాతి రత్నాలు సినిమాలో రాహుల్ రామ కృష్ణ కామెడీ హైలెట్ అని చెప్పాలి. ఒక పక్క హీరోల పక్కన కమెడియన్ గానే కాకుండా ఆయన హీరోగా కూడా రాహుల్ రామ కృష్ణ సినిమాలు చేస్తున్నారు. ఈ మద్యనే వచ్చిన నెట్ సినిమాలో కూడా ఆయన హీరోగా నటించి మెప్పించారు. సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని రాహుల్ రామా కృష్ణ ని సినిమాల్లోకి తెచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ . ఆయన తీసిన సైన్మా అనే చిన్న షార్ట్ ఫిల్మ్ లో రాహుల్ రామ కృష్ణ ని హీరోగా పరిచయం చేశాడు.

ఈ షార్ట్ ఫిల్మ్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ లో ఆయన నటన చూసి సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి లో ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరసగా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లో రాహుల్ చాలా బిజిగా ఉన్నాడు. పెద్ద స్టార్ హీరోల సినిమాలో కూడా రాహుల్ కి ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు అంటే ఆయన నటనకి డైరెక్టర్స్ ఎంత విలువ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: