ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో 'మా' ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది. అక్టోబర్ 10 న జరగబోయే ఈ ఎన్నికలకు తాజాగా నేడు నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ జరగనుంది.ఇక ఓ వైపు థియేటర్స్ సమస్యలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. మరోవైపు మా ఎన్నికలతో మొత్తంగా టాలీవుడ్ అంతా హడావుడిగా కనిపిస్తుంది.ఇక మా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కూడా ఇప్పటికే ఊపందుకున్నాయి.ఇక ఈసారి యువకుడు అయిన మంచు విష్ణు.. మా అధ్యక్ష పదవికి కోసం బరిలోకి దిగుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

చివరి నిమిషం వరకు మా ఎన్నికలు ఏకగ్రీవం కావాలని కోరుకున్నాడు విష్ణు.చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే ఎవరైనా ఇండ్రస్టీ పెద్దలు కలిసి మంచి వ్యక్తిని మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారేమో అని ఎదురుచూసాను.కానీ అలా జరగడం లేదని గ్రహించాకే తాను కూడా పోటీలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించానని మంచు విష్ణు తెలిపాడు.ఇక బాలకృష్ణ లాంటి వ్యక్తి ఎన్నికల నుండి తప్పుకోమని అడిగితే తప్పుకుంటా అని.. కానీ బాలకృష్ణ అంకుల్ నాకు ఫోన్ చేశారు.మంచి నిర్ణయం తీసుకున్నావ్ తమ్ముడు.. నీకు నేనున్నా.. ధైర్యంగా ముందుకు వెళ్ళు అని అన్నారు.

ఇక మెగా బ్రదర్ నాగబాబు గురించి కూడా మంచు విష్ణు మాట్లాడుతూ.. నేను నాగబాబు అంకుల్ ని మా ఇంటి పెద్దగా భావిస్తాను.వాళ్ళందరి కళ్ళ ముందు నేను పెరిగాను.కానీ ఆయన చేసిన కామెంట్స్ నన్ను బాధించాయి..అని చెప్పుకొచ్చాడు. ఇక కొంతమంది ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే హడావుడి చేసారు.వాళ్ళల్లో ప్రస్తుతం మా అసోసియేషన్ పదవుల్లో ఉన్న వారు కూడా ఉన్నారు.అలాంటి వాళ్ళని ఒక రూమ్ లో వేసి ఇండ్రస్టీ పెద్దలు అంతా కలిసి చేతులు వాచిపోయేలా కొట్టాలి.మా అసోసియేషన్ లో ఉంటూ ఇలా చేయడం కరెక్ట్ కాదని కామెంట్ చేశారు మంచు విష్ణు.ఇక అక్టోబర్ 10 న జరగబోయే ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: