టాలీవుడ్ టాలెంటెడ్ హీరో లవర్ బాయ్ నాగ చైతన్య అంటే ప్రేమ కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఇక కరోనా వైరస్ సెకండ్ వేవ్ తరువాత ఓ భారీ వేవ్ లా దూసుకొచ్చాడు నాగచైతన్య.ఇక ఇటీవల చైతూ నటించిన లవ్ స్టోరి సినిమా అదిరిపోయే వసూళ్లను సాధిస్తూ ఇప్పుడు ఏకంగా 50 కోట్ల క్లబ్ లో చేరింది. లవ్ స్టోరీ సినిమా విడుదల అయిన ఫస్ట్ వీకెండ్ మూడు రోజుల్లోనే 50కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక షేర్ విషయానికి వస్తే ఈ సినిమా 25 కోట్లు పైగా షేర్ ని కలెక్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం అని చెప్పాలి. ఓ వైపు కరోనా మహమ్మారీ భయాలు బాగా వెంటాడుతున్నా కాని జనం థియేటర్లకు వచ్చేందుకు వెనకాడలేదని ఈ సినిమా రిజల్ట్ చాటి చెబుతోంది.ఇక నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన మజిలీ సినిమా తర్వాత నాగచైతన్యకు మరో బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ సినిమాగా ఇది రికార్డులకెక్కడం జరిగింది.

ఇక అలాగే లవ్ స్టోరి సినిమాపై చిన్న పాటి విమర్శలు అనేవి వచ్చినా కాని ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఊహించని భారీ విజయం దక్కించుకుంది. చైతూ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగులను సాధించిన ఈ సినిమా రికార్డ్ హిట్ దిశగా దూసుకెళుతుందు. ఇక కేవలం 3రోజుల్లో ఈ సినిమా నైజాంలో 8కోట్లు వసూలు చేయగా సీడెడ్ లో 3 కోట్లకు పైగా వసూలు చేసింది.. ఇక ఉత్తరాంధ్రలో 2కోట్లు వసూలు చేసింది.గుంటూరు ఇంకా తూర్పు గోదావరి లో ఈ సినిమా కోటి చొప్పున వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందింది.ఇక ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్లతో దుమ్ము దులుపుతుంది.ఇక ఇప్పటికే 6 కోట్లు వసూళ్లు చేసి 1 మిలియన్ డాలర్లు వసూలు చేయడం జరిగింది. ఇక అలాగే జాతి రత్నాలు సినిమా తరువాత పాండమిక్ టైంలో 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాగా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక చూడాలి ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: