ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియా అంత శేఖర్ కమ్ముల సినిమా లవ్ స్టొరీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా థియేటర్స్ లో విడుదల చెయ్యాలి అనుకునే చాలామంది ప్రొడ్యూసర్స్ కి ధైర్యన్ని ఇచ్చింది. అలాగే కొన్ని నెలలుగా మూసి ఉన్న థియేటర్స్ ని ఈ సినిమా మళ్ళీ ఓపెన్ అయ్యేలా చేసింది. అయితే ఈ లవ్ స్టొరీ సినిమా గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. అదేంటి అంటే ఈ సినిమాని శేఖర్ కమ్ముల కొత్తవాళ్ళ తో చెయ్యాలి అనుకున్నారట.కానీ మంచి హీరోతో అయితే సినిమా ఇంకా ఎక్కువమందికి రీచ్ అవుతుంది అని శేఖర్ ఈ సినిమాని చాలామంది హీరోస్ కి వినిపించారట.

అలా హీరో వైష్ణవ్ తేజ్ దగ్గరికి ఈ సినిమా కథ వచ్చింది అని టాక్. అయితే కథ చాలా బాగా నచినప్పటికి వైష్ణవ్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడట. దానికి కారణం ఉప్పెన సినిమా కూడా కులాల మీద కథలో నటించి మళ్ళీ ఇంకొక సినిమా అలాంటిదే చేయడం ఎందుకు అని ఈ సినిమాని వైష్ణవ్ రిజెక్ట్ చేసాడు. ఇక ఈ సినిమా చైతన్య దగ్గరికి వెళ్ళింది. చైతు కథ ని వెంటనే ఓకే చేసి షూటింగ్ మొదలుపెట్టాడు.ప్రస్తుతం ఈ లవ్ స్టొరీ కలెక్షన్స్ ని చూస్తుంటే ఈ సినిమా పూర్తి రన్ ఐపోయేలోపు 50 కోట్ల వరకు షేర్ ని తెచ్చేలాగా ఉంది.

ఈ సినిమాని నిర్మాతలు 32 కోట్లకి అమ్మారు. మొదటి మూడు రోజుల్లోనే లవ్ స్టొరీ కి దాదాపుగా 22 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇంకో 10 కోట్ల కలెక్షన్స్ ని సంపాదించడం సినిమాకి పెద్ద కష్టంలాగా కనిపించట్లేదు. కరోన సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలో వచ్చిన సినిమాల అన్నింటిలో లవ్ స్టొరీ కలెక్షన్స్ ఏ ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: