క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్ వారు దీనిని రెండు పార్ట్శ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, అలానే ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ కూడా ఇటీవల విడుదలై ఆడియన్స్ నుండి సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ చేసాయి. అల్లు అర్జున్, పుష్పరాజ్ అనే పక్కా మాస్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కూడ పక్కాగా అటువంటి మాస్ పాత్ర లోనే కనిపించనున్నట్లు సమాచారం.

ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాని భారీ యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సుకుమార్ ఎంతో అద్భుతంగా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా ని దసరా కి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 17న విడుదల చేసేలా డేట్ ఫిక్స్ చేసిందట యూనిట్.

ఇప్పటికే రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసిన యూనిట్, దసరా రోజున దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేయనుందట. ఇక త్వరలో రెండవ పార్ట్ షూటింగ్ కూడా ప్రారంభం కానుండగా దానిని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారట. మొత్తంగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: