మున్నా మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు వంశీ పైడిపల్లిమూవీ తో ఫ్లాప్ ని మూటగట్టుకున్నారు. ప్రభాస్, ఇలియానా హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. ఆ తరువాత ఎన్టీఆర్ తో బృందావనం మూవీ తీసి హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి, అనంతరం రామ్ చరణ్ తో ఎవడు, అలానే నాగార్జున, కార్తీ ల కలయికలో ఊపిరి మూవీస్ తీసి వాటితో కూడా సక్సెస్ కొట్టారు.

ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించి మంచి హిట్ సొంతం చేసుకున్న వంశీ పైడిపల్లి త్వరలో కోలీవుడ్ నటుడు ఇలయతలపతి విజయ్ తో తన నెక్స్ట్ మూవీ తీయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో భారీగా నిర్మించనున్న ఈ సినిమా యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ నిన్న వచ్చింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తో బీస్ట్ మూవీ చేస్తున్న విజయ్ దానిని వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే వంశీ పైడిపల్లి తో విజయ్ చేయనున్న సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం.

అయితే విశేషం ఏమిటంటే, ఈ మూవీ యొక్క అధికారిక పూజా కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా రానున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్. మహర్షి సినిమా తరువాత వంశీ పైడిపల్లి కి మహేష్ తో మంచి అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. అలానే విజయ్ తో కూడా మహేష్ కి మంచి రిలేషన్ ఉండడంతోనే సూపర్ స్టార్మూవీ లాంచింగ్ కి స్పెషల్ గా విచేస్తున్నారని అంటున్నారు. కాగా ఈ సినిమా.లో నటించనున్న హీరోయిన్, ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు లాంచింగ్ రోజునే వెల్లడించనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: