ప్రస్తుతం తమిళ్ లో యువ సంగీత దర్శకుడిగా మంచి క్రేజ్ తో పాటు పలు భారీ అవకాశాలు కూడా సొంతం చేసుకుంటూ కొనసాగుతున్నారు అనిరుద్. తమిళ్ లో యువ నటులతో పాటు పలువురు స్టార్ నటుల తో సైతం ఎన్నో సినిమాలు చేస్తున్న అనిరుద్ వాటితో పలు భారీ సక్సెస్ లు కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల రజినీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తీసిన మాస్ యాక్షన్ సినిమా పెట్ట అలానే యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఇలయతలపతి విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ వంటి సినిమాలకు సంగీతం అందించి తద్వారా మరొక రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నారు అనిరుద్.

ముఖ్యంగా అనిరుద్ అనిందించే సాంగ్స్, తో పాటు బీజీఎమ్ కి యువత తో పాటు మాస్ ప్రేక్షకులకి ఎంతో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక ఇటు తెలుగులో కూడా పలు సినిమాలకు మ్యూజిక్ అందించారు అనిరుద్. నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్, జెర్సీ మూవీస్ కి మ్యూజిక్ అందించి ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా బాగా క్రేజ్ సొంతం చేసుకున్న అనిరుద్, మూడేళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసి సినిమా కి కూడా సంగీతం అందించారు. అయితే త్వరలో ఎన్టీఆర్, కొరటాల శివ ల భారీ సినిమాకి కూడా మ్యూజిక్ అందించనున్న అనిరుద్ ఆపైన పవర్ స్టార్ తో సురేందర్ రెడ్డి తీయనున్న స్టైలిష్ ఎంటర్టైనర్ కి కూడా మ్యూజిక్ అందించనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్.

గతంలో పవన్ తో పని చేసిన అజ్ఞాతవాసి ఫెయిల్ అవడంతో ఈసారి పవర్ స్టార్ తో ఎలాగైనా భారీ సక్సెస్ కొట్టేలా ఈ సినిమాకి మరింత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారట అనిరుద్. అలానే దీనిపై త్వరలో అధికారికంగా అనౌన్స్ మెంట్ కూడా రానుందట.  కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే త్వరలో మరొకసారి పవర్ స్టార్, అనిరుద్ ల కలయికలో మంచి మ్యూజికల్ ఫీస్ట్ ని చూడవచ్చని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: