సినీ పరిశ్రమలో చాలామంది  రిలేషన్ షిప్ లో ఉంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ఇటీవల సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ హీరోల వరకు ఎంతో మంది తమకు నచ్చిన వారితో రిలేషన్ షిప్ లో కొంతకాలం జీవితాన్ని గడిపి , ఆ తరువాత పెద్దల నిశ్చయించిన పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు.. మరి కొంతమంది రిలేషన్షిప్ లో ఉంటూ వారితోనే ప్రేమలోపడి పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు.. ఇక కొన్ని వర్గాల నటులు ఎలా ఉన్నారంటే ఒకరితో ముందు ప్రేమాయణం, ఆ తరువాత మరోకరితో పెళ్లి.. కొంత కాలం తర్వాత వారు కూడా నచ్చకపోతే ఏకంగా విడాకులే..ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య కూడా సమంతతో ప్రేమలో పడక ముందు మరొక అమ్మాయి తో ఎఫైర్ నడిచినట్లు వార్తలు బాగా వినిపించాయి.. ఆమె ఎవరో కాదు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్.. నిజానికి శృతి హాసన్ తో కలిసి నాగచైతన్య ఎక్కువగా కూడా కలిసి సినిమాలు చేయలేదు.. కానీ ప్రేమమ్ లో వీరిద్దరు జంటగా నటించారు.. ఇక ఈ సినిమాతో బాగా దగ్గరయ్యారని సమాచారం... అంతే కాదు బయటకు వెళ్లడం , సినిమాలకు, ఫంక్షన్లకు, పార్టీలకు ఇలా కలిసి వెళుతుండటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే వార్తలు కూడా వినిపించాయి..


కానీ  ఏ  మాయ చేశావే సినిమాతో సమంతతో ప్రేమలో పడిన నాగ చైతన్య.. మనం సినిమా తర్వాత పెళ్ళికూడా చేసుకున్నాడు.. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం జరుగుతుందని తెలుసుకున్న మీడియా వర్గాలు కూడా ఇక శృతి హాసన్ , నాగ చైతన్య జోడీపై కామెంట్లు రాయడం మానేశారు. ఇక మీడియా కూడా సమంత - నాగచైతన్య జోడి పై ఫోకస్ పెట్టి ఇక వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా..? అని ఈ విషయమై ఆరా తీయడం జరిగింది. ఏదిఏమైనా అప్పట్లో వచ్చిన రూమర్స్ ఆ తర్వాత సమంతను పెళ్లి చేసుకోవడంతో సద్దుమణిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: