డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్.. నందమూరి నటసింహం బాలకృష్ణకు మాట ఇచ్చాడు. ఈ సారి ఎలాగైనా మంచి హిట్ ఇస్తానని ఒట్టేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే పైసా వసూల్ వచ్చింది. ఇది ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయినా.. పూరీ జగన్నాథ్ కు మంచి పేరే వచ్చింది. ఇందులో బాలయ్యను వైవిధ్యంగా చూపించారు పూరీ జగన్నాథ్. తాగుబోతు క్యారెక్టర్ లో ఒదిగిపోయిన బాలయ్య.. ఆ స్థితిలో ఉంటూనే దిమ్మతిరిగే డైలాగులతో ఆకట్టుకున్నాడు.

ఇక బాలకృష్ణ కూడా ఈ సినిమా అంతగా విజయం సాధించలేకపోయినందుకు ఫీల్ కావడం లేదు. పైగా తనను కొత్తగా చూపించినందుకు మురిసిపోయాడు. రెండోసారి పూరీతో సినిమా చేస్తానని ప్రామిస్ చేశాడు. ఇలా ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారు. ఇంకేముందీ బాలయ్య అభిమానుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి ఆ అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే సినిమాలో ఎలాంటి డైలాగులు ఉంటాయోనని ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు.

ఇక బాలయ్య కోసం పూరీ జగన్నాథ్ అదిరిపోయే సినిమా తీస్తున్నట్టు సమాచారం. పైసా వసూల్ లో జరిగిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు ఈ డైరెక్టర్. బాలయ్య సినీజీవితంలో ఎన్నడూ చూడని విజయాన్ని అందిస్తానని చెబుతున్నాడు పూరీ.

పూరీ జగన్నథ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా తీస్తున్నాడు. అందులో అనన్య పాండే హీరోయిన్ గా రౌడీ హీరోత జతకడుతోంది. బాక్సింగ్ బ్యాక్ గ్రౌండ్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఎన్నో ఆశలున్నాయి. ఈ షూటింగ్ ను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. సెప్టెంబర్ 30తో అక్కడ షూటింగ్ ముగుస్తుంది. లైగర్ లో రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ రోజు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు కావడంతో లైగర్ మూవీపై ఏదైనా అప్ డేట్ వస్తుందేమోనని రౌడీ హీరో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  
మరింత సమాచారం తెలుసుకోండి: