టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక హీరో హీరోయిన్ ఇద్దరూ కలసి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేస్తే వారిద్దరికీ ఎఫైర్ లు అంటగడతూ ఉంటారు. అలా అనాదికాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరో హీరోయిన్లకు లింకులు పెడుతూ వచ్చారు. హీరో హీరోయిన్ లనే కాకుండా ఇండస్ట్రీ లో పనిచేసే ఏ ఇద్దరు ఆడ మగ కలిసి పనిచేసిన కూడా ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అలా టాలీవుడ్ లో యంగ్ హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తూ హిట్లు సాధించుకుపోతున్నా నితిన్ మరియు నిత్యా మీనన్ ల మధ్య ఎఫైర్ నడిచిందనే వార్తలు గతంలో చాలా వచ్చాయి.

వీరిద్దరూ కలసి ఇష్క్ చిత్రంలో నటించగా ఆ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇది నితిన్ కి మంచి కం బ్యాక్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా కంటే ముందు ఆయన కెరీర్ దాదాపు అయిపోయినట్లుగా అని అందరూ అనుకున్నారు.వరుస ఫ్లాప్ లు రావడం, ఎంత ట్రై చేసిన హిట్ అవకపోవడం వంటివి నితిన్ కి హిట్ రాకుండా చేశాయి. కానీ నితిన్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఎక్స్ పరిమెంటల్ సినిమాగా ఇష్క్ చిత్రం చేయగా అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా ఎంపిక కావడం వల్ల ఆమె అద్భుతంగా నటించడం వల్లనే ఈ సినిమా హిట్ అయిందని నితిన్ మళ్లీ కం బ్యాక్ చేయగలిగాడు అని అప్పట్లో అందరూ అన్నారు. అంతే కాదు ఈమె నితిన్ కి లక్కీ గాళ్ అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో నితిన్ ఆమెతో మరొక సినిమా చేయాలని భావించాడు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో నిత్యామీనన్ తో కలిసి వరుసగా రెండవసారి చేశాడు. దాంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు బాగా వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరూ తమ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చిన కూడా ఆ రూమర్స్ ఆగలేదు. చివరికి హీరో నితిన్ పెళ్లి చేసుకోవడంతో ఈ రూమర్స్ కి చెక్ పడినట్లు అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: