మెగా పవర్ స్టార్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో చిరుత అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఫలితం సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ హీరోగా ఎలివేట్ చేయడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. డ్యాన్సులు ఫైట్లు అన్ని సమపాళ్లలో కుదిరిన సినిమా రామ్ చరణ్ కు గొప్ప ఎంట్రీ సినిమా గా మిగిలి పోయిందని చెప్పవచ్చు. మెగా స్టార్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చిన చరణ్ తొలి సినిమా తోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు ఒక అపవాదును కూడా అందుకున్నాడు రామ్ చరణ్.

అదేమిటంటే.. హీరోయిన్ తో నేహా శర్మ తో రామ్ చరణ్ ఎఫైర్ నడుపుతున్నాడు అనే వార్త బాగా ప్రచారం అయ్యింది. వాస్తవానికి ఇద్దరికీ కూడా ఇది మొదటి సినిమా.. అంతకుముందు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినా నేహా శర్మ కి అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. ఆమెకు తెలుగులో మాత్రం ఇదే మొదటి సినిమా. అయితే ఈ సినిమా పూర్తయ్యే సరికి వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్త టాలీవుడ్ లో తెగ వచ్చిది. దాంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

 కానీ రామ్ చరణ్ ఉపాసన ను పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలకు చెక్ పడ్డట్లు అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ చరణ్ ఎప్పుడు ఎఫైర్ ల వివాదాలలోకి వెళ్ళలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రామ్ కాహ్రాన్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో rrr అనే సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ సినిమా తో పాన్ ఇండియా లెవెల్లో తన స్టామినా ను చుపించాబోతున్నాడు రామ్ చరణ్. ఏదేమైనా మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు అని చెప్పొచు. 

మరింత సమాచారం తెలుసుకోండి: