ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో   ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలకు రెడీగా ఉన్న మూవీ  మహా సముద్రం. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100 తో మంచి విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. అజయ్ భూపతి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై జనాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ మధ్య ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ తో సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమాన్యుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 ఇలా జనాలలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలు కూడా జనాలు నుండి మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమా మొదటి థియేటర్లలో విడుదలై ఆ తర్వాత ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ ఒక వార్త బయటకు వచ్చింది. అలాగే ఈ సినిమాను 11 కోట్ల వరకు వెచ్చించి ప్రముఖ ప్రముఖ ఓ టి టి సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ వార్త పట్ల ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ సినిమాతో శర్వానంద్, సిద్ధార్థ్ లకు ఎలాంటి విజయం దక్కుతుందో , దర్శకుడిగా అజయ్ భూపతి రెండో విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలంటే సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: