మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది నటీనటులు, నిర్మాతలు పరిచయమయ్యారు. నటుడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న వరుణ్ తేజ్ కెరియర్ ప్రారంభంలో కొంచెం డల్‌గానే ఉంది. మొదట్లో కథలపై పెద్దగా ఫోకస్ చేయని వరుణ్.. ఇప్పుడు కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అలా సినిమాలు సక్సెస్ అవడంతో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్తున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. మొదట్లో మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినా.. ప్రేక్షకుల మన్నన పొందలేకపోయారు. కథల ఎంపికలో ఫోకస్ పెడుతూ మంచి పాత్రలున్న క్యారెక్టర్‌లను సెలక్ట్ చేసుకుంటున్నారు. ప్రేక్షకాభిమానాన్ని పెంచుకుని స్టార్ హీరోల వరుసలో ఉన్నారు. అయితే హీరో వరుణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో తనకు జరిగిన మధుర, చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు.

‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అనే షోలో మంచు లక్ష్మి, వరుణ్ తేజ్ మధ్య ఆసక్తిక సంభాషణ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో వరుణ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఎంతో భయం వేస్తోందని పేర్కొన్నారు. అయితే మంచు లక్ష్మి.. వరుణ్ తేజ్‌కు పర్సనల్ కొషన్ అడుగుతుంది. మొట్టమొదటిసారిగా ఎవరికి ముద్దు పెట్టావ్ అని అడిగింది. దీనికి వరుణ్ నవ్వుకుంటూ ఇలాంటి కొషన్ అడిగితే భయం వేస్తోందని చెప్తూ.. పదో తరగతిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి ముద్దు పెట్టాలని చెప్పారు.

ఆ తర్వాత మంచు లక్ష్మి మాట్లాడుతూ.. మీకు లేడీ ఫాలొయింగ్ ఎక్కువే.. అభిమానులు ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. దీనికి వరుణ్ మాట్లాడుతూ.. ఒకసారి స్నేహితులతో కలిసి క్లబ్‌కి వెళ్లానన్నారు. అక్కడ స్నేహితులతో డ్యాన్స్ చేస్తుండగా.. ఒక అమ్మాయి వెనుక నుంచి హగ్ చేసుకుందన్నారు. ఎవరో ఫ్రెండ్ అయి ఉండవచ్చని అనుకున్నానని.. తీరా చూస్తే అమ్మాయి ఉందన్నారు. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా ఆ అమ్మాయి ముద్దు పెట్టి వెళ్లిపోయిందన్నారు. ఆ క్షణం తనకు ఎంతో భయం వేసిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: