టాలీవుడ్ లోకి సమంత మొదటి గా ఏ మాయ చేసావే మూవీ తో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకావడంతో ఆ తర్వాత ఈమె వెనుతిరిగి చూడలేదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సైతం నటిస్తోంది. ఇక అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న తర్వాత.. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. కమర్షియల్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. తన పాత్రకు పేరు వచ్చేటువంటి సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.

అలా లేడి ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా చేస్తోంది సమంత. ఇక ఇదంతా ఇలా వుండగా కొద్ది రోజుల నుంచి సమంత వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి.. వస్తున్నాయి కూడా.. ఇక వీరిద్దరూ..తమ వైవాహిక జీవితానికి గుడ్బై చెప్పనున్నారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈమె సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేయడం వల్ల.. ఇంకా పలు గట్టిగా వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయంపై ఇప్పటివరకు వీళ్ళిద్దరూ ఎవరు క్లారిటీ ఇవ్వకపోవడంతో సినీ ఇండస్ట్రీలోని స్టార్స్ సైతం కూడా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా సమంత మాత్రం ఒక కొత్త అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఫెమీనా షాబ్ 40 లో సమంత చోటు దక్కించుకుంది. సమంతాకు రెండు నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 4, 3 సినిమా అవార్డులు సైతం గెలుచుకున్నది.

ఈ సంవత్సరానికి గాను ఎంతో ప్రభావితం చూపించే మహిళల ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇక దీని పై సమంత తనదైన శైలిలో స్పందిస్తూ.. ఇది తనకు ఎంతో సంతోషాన్ని  ఇస్తుంది అని.. ఈ విషయాన్ని నేను సగర్వంగా చెప్పుకుంటానని.. సమంత తన ట్విట్టర్ నుంచి ఈ విషయాన్ని వెల్లడించింది.మరింత సమాచారం తెలుసుకోండి: