అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఎంత అందంగా ఉంటుందో అంతే అందమైన నటనతో జనాలను ఆకట్టుకున్న ఈ హాట్ బ్యూటీ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రజల మనస్సు లను కొల్లగొట్టింది. ఆ తర్వాత మరో అక్కినేని హీరో అయిన అక్కినేని అఖిల్ తో కూడా మజ్ను సినిమాలో ఆడిపాడి తెలుగు ప్రజల మనసు దోచుకుంది, ఇలా సినిమాల లో తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ కి ఈ రెండు మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి.  ఇలా అందంతో , అభినయంతో ఆకట్టుకున్న సినిమాలు నిరాశ పర్సు వస్తున్న సమయంలోనే రామ్ పోతినేని హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.

 ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, దీనితో పాటే మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది .ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక విషయాన్ని తెలియజేసింది. తాను తొమ్మిది సినిమాలకు డబ్బింగ్ చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది , దీనితో అంతా షాక్ అయిపోయారు . ఇందులో దాదాపు అందరికీ తెలిసిన సినిమాలు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు , ఇక మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమా. మరి నిధి అగర్వాల్ డబ్బింగ్ చెబుతున్న మిగతా సినిమాలు ఏంటా అని కొంత మంది అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: