తెలుగు టాప్ హీరో లలో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తుంది , అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రామ్ చరణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ అయినా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కబోయే సినిమా షూటింగు లో పాల్గొన బోతున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ టాలెంటెడ్ శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కబోయే సినిమాను దర్శకుడు శంకర్ మూడు నెలల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.

 ఈ సినిమాను వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసుకుని ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చక చకా పూర్తి చేసి వీలైనంత తొందరగా జనాలు ముందుకు తీసుకురావాలని శంకర్ ప్లానింగ్ వేసుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఇది వరకు వచ్చిన సినిమాలు చాలా కాలం పాటు షూటింగ్  జరుపుకొని , ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏ మాత్రం తొందర లేకుండా జరుపుకొని టైం ఎంత లేట్ అయినా కాంప్రమైజ్ కాకుండా సమయాన్ని పట్టించుకోకుండా చిత్రీకరించి సినిమాలు విడుదల చేసే వారు, కానీ ఈ సినిమాను మాత్రం అందుకు భిన్నంగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు శంకర్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆఫీషియల్ లాంచింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది, ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ,బాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: