గోవా బ్యూటీ ఇలియానా రామ్ హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో తెలుగు ప్రజల మనసు కొల్లగొట్టింది ,ఈ సినిమాలో తన అందంతో, అభినయంతో, హావభావాలతో తెలుగు ప్రజల మనసులను కొల్లగొట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత కూడా తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోయింది. అందులో భాగంగా పోకిరి ,మున్నా, జులాయి, రాఖి, జల్సా, శక్తి వంటి పలు చిత్రాలలో నటించి తెలుగు టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఇలా ఇలా టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అంతగా సినిమా అవకాశాలను రాబట్టుకోలేక పోయింది.

ఇలా కొంత కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ శ్రీను వైట్ల దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చింది, ఈ సినిమాతో ఓ రేంజ్ లో దూసుకుపోవాలి అనుకున్నా ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. ఇలా టాలీవుడ్ లో ప్రస్తుతం కూడా పెద్దగా సినిమాలు ఏమీ లేని ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే గోవా బ్యూటీ ఇలియానా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది ,తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు  వేడెక్కిస్తు ఉంటుంది. అయితే తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది ,ఈ ఫోటోలో ఇలియానా వొళ్ళు విరుస్తున్న ఫోజులో ఒక దుప్పటి కప్పుకొని ఉంది. ఇలియానా కు సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: