యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూడో చిత్రం పుష్పకవిమానం నవంబర్ 12 న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మేరకు మేకర్స్ విడుదల తేదీ నీ అధికారికంగా ప్రకటించారు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలతో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ దామోదర అనే నూతన దర్శకుడు తో కలిసి పుష్పకవిమానం సినిమా చేయగా ఈ సినిమా ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అంతే కాదు ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడేలా చేశాయి.

సిడ్ శ్రీరామ్ పాడిన కళ్యాణం కమనీయం అనే పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ అందుకుని సూపర్ హిట్ గా నిలవగా ఇప్పటికీ ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ పాట అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపిస్తుండగా ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉండే డ్రామాను గుర్తుచేస్తూ పెళ్లి చుట్టూ ఉండే పరిస్థితులను చూపెడుతుందని తెలుస్తోంది.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండసినిమా ను సమర్పిస్తూ ఉండగా కింగ్ అఫ్ ది హిల్ మరియు టాంగా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోవర్ధనరావు దేవరకొండ మరియు విజయ్ మట్టపల్లి ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలుగా వ్యవహరించారు. రామ్ మిరియాల సిద్ధార్థ్ సదాశివుని అమిత్ దాసాని సంగీతం సమకూర్చగా రవితేజ గిరిజాల ఎడిటర్ గా పని చేశాడు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల కాకముందే ఆనంద్ దేవరకొండ తన నాలుగో చిత్రం హైవే ను కూడా మొదలుపెట్టి దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేశాడని తెలుస్తుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: