మెగాస్టార్ చిరంజీవి కుమారుడు చిరుత సినిమా తో అడుగు పెట్టి , ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి రికార్డును సృష్టించాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈరోజుకి 14 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


1985 మార్చి 27న చెన్నైలో జన్మించాడు రామ్ చరణ్. ఇక సినీ ఇండస్ట్రీకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాలో నటించడం కోసం ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఇక తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ హీరో. ఇక తనదైన శైలిలో డాన్స్ లు ,  ఫైట్లు చేస్తూ చిరంజీవి వారసుడు అనిపించుకున్నాడు. చిరుత సినిమా క్లైమాక్స్ లో ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కించినప్పుడు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు రామ్ చరణ్. మగధీర సినిమాతో సినీ ఇండస్ట్రీలోని రికార్డులను తిరగరాశాడు రామ్ చరణ్.
ఇక రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఈయన మెగాస్టార్ వారసుడే కాదన్నారు. కానీ ఆ విషయాలన్నిటిని గుర్తు పెట్టుకొని తన నటనతో ప్రేక్షకులను అబ్బుర పరిచేలా చేశాడు రామ్ చరణ్. ఇక అంతే కాకుండా రామ్ చరణ్ కెరియర్ మొదట్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదని హేళన కూడా ఎదుర్కొన్నారట. బ్యాడ్ బాయ్ అంటూ కూడా విమర్శించారట.

అలా ఒక మైనస్ నుంచి ప్లస్ కు మార్చుకొని తన కెరియర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గా దూసుకుపోతున్నాడు. ఇక అంతే కాకుండా ఒక ప్రొడ్యూసర్ గా కొణిదెల బ్యానర్ స్థాపించి అందులో సినిమాలు నిర్మిస్తున్నాడు. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు రామ్ చరణ్. రామ్ చరణ్ కెరీర్ లో మొదటి ప్లాప్ గా నిలిచిపోయింది ఆరెంజ్ సినిమా. ఇక జంజీర్.. బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా విమర్శల పాలయ్యాడు. ఇక రంగస్థలం , ధృవ వంటి సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచాడు రామ్ చరణ్. ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మనం మనస్పూర్తిగా కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: