సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు డబ్బింగ్ అవుతుంటాయి. తమిళంలో సక్సెస్ అయిన సినిమాలు తెలుగులో రీమేక్ చేయడం.. తెలుగులోని సినిమాలు వేరే భాషల్లో రీమేక్ చేయడం జరుగుతుంటుంది. గతం నుంచే ఇలాంటి సాంప్రదాయం కొనసాగుతోంది. టాలీవుడ్ సెన్సెషనల్ మూవీ సుందరకాండ కూడా రీమేక్ చిత్రమే. విక్టరీ వెంకటేష్ హీరో నటించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనా, అపర్ణ నటించారు. ఈ సినిమాను తమిళంలో భాగ్యరాజా దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాను సుందరకాండగా విడుదల చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత కేవీవీ సత్యనారాయణ తమిళంలో సుందరకాండ సినిమాను చూశారు. ఈ సినిమాలను చూశాక.. ఎలాగైనా సరే డబ్బింగ్ చేయాలని అనుకున్నారు. ఆయన అనుకున్నట్లే సినిమాపై రీమేక్ హక్కులను కూడా కొనుగోలు చేశారు.

తెలుగులో అప్పటికే క్రేజ్ ఉన్న హీరోయిన్ విక్టరీ వెంకటేష్. హీరో వెంకటేష్ సినిమా చూసిన నిర్మాత సుందరకాండ సినిమాలో నటించేందుకు ఒప్పించారు. సినిమా కోసం హీరోని సెలక్ట్ చేయకన్న ముందే నిర్మాత సత్యనారాయణ అన్ని ఏరియాల హక్కులను కూడా అమ్మేశారు. ఆ తర్వాత సినిమాలో వెంకటేష్ నటిస్తున్నాడని చెప్పడంతో బయ్యర్లకు రెట్టింపు డబ్బులు ఇప్పించి మరీ సుందరకాండ సినిమా డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల కాకుండా చేశారు. అయితే ఈ సినిమా అప్పటికీ తమిళంలో విడుదల కాలేదు. నిర్మాత సత్యనారాయణ కేవలం డబ్బింగ్ రైట్స్ తీసుకోవడంతో సుందరకాండ సినిమాకు మరో సమస్య ఎదురైంది.

నిర్మాత సత్యనారాయణ రీమేక్ హక్కుల అగ్రిమెంట్‌లో కూడా రీమేక్ అనే పదం వాడలేదు. దీంతో నిర్మాత సత్యనారాయణ, దర్శకుడు భాగ్యరాజాకు మరో రూ.25 లక్షలు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకున్నారు. సినిమా విడుదల కాకముందే తెలుగు వెర్షన్ కోసం రూ.45 లక్షలు ఖర్చు అయింది. కాగా.. ఈ సినిమాను మొదట తమిళ వెర్షన్‌లో విడుదల చేయకుండా.. తెలుగులోనే రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ద్వారా నిర్మాత లక్షల రూపాయలను వెనక్కి వేసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: