మన తెలుగులో కీర్తి సురేష్ కి మహానటి సినిమా తర్వాత చాలా క్రేజ్ పెరిగింది. మహానటి సినిమా తర్వాత ఆమె భారీగా రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నారని అగ్ర హీరోల సినిమాల్లో నటించడానికి ఆమె ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ఆమె గురించి కొన్ని వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. కీర్తి సురేష్ కి రెమ్యునరేషన్ని ఎక్కువగానే టాలీవుడ్ లో ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారని, అయితే ఆమెను చాలా పాత్రల కోసం అడుగుతున్నారని హీరోయిన్ పాత్రలే కాకుండా చెల్లెలి పాత్రలో కూడా ఆమె తీసుకుంటారని అంటున్నారు.

చిరంజీవి సినిమాలో ఆమెను చెల్లెలి పాత్రలో తీసుకుని అలాగే మరో హీరో సినిమాలో కూడా ఆమెను చెల్లెలి పాత్రలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే మేనకోడలు పాత్రలో కూడా ఒక హీరో సినిమాలో ఆమెను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమాలో ఆమెను జూనియర్ ఎన్టీఆర్ మేనకోడలు గా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అలాగే ప్రభాస్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో తీసుకునే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత వస్తుంది.

కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు అలాగే  తమిళంలో 2 సినిమాలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో  ఆమె ఒక చిన్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని ప్రచారం ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయంలో ఆమె చాలా ఆసక్తి కరం గా ఉంటున్నారు. తెలుగు లో మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఎలా ఉన్నా సరే కీర్తి సురేష్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. మహానటి సినిమా తర్వాత ఆమెకు తెలుగులో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. నటన విషయంలో కీర్తి చాలామంది హీరోయిన్ల కంటే మెరుగ్గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: