టాలీవుడ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాత్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టీన‌టులు, ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు పూరీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే పూరీ కూతురు ప‌విత్ర పూరీ కూడా పూరీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతు ఓ త‌మ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసి ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈ ఫోటోలో పూరీ జ‌గన్నాత్ ఆయ‌న స‌తీమ‌ని, మ‌రియు కొడుకు ఆకాష్ పూరీ ఉన్నారు. ఇక ఈ ఫోటోకు ప‌విత్ర పూరీ...పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు నాన్నా...మిస్ యూ..మీరు త్వ‌ర‌గా మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేయండి అంటూ పోస్ట్ పెట్టారు. 

ఈ ఫోటోకు ఏడుస్తూ క‌నిపించే ఎమోజీల‌ను ప‌విత్ర షేర్ చేశారు. ఇక ప‌విత్ర షేర్ చేసిన ఫోటోకు పూరీ జ‌గన్నాత్ అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పూరీ జ‌గన్నాత్ త‌న కూతురు మ‌రియు కొడుకుల‌ను ప్ర‌భాస్ హీరోగా న‌టించిన బుజ్జిగాడు సినిమా ద్వారా ఇండ‌స్ట్రీకి ప‌రిచయం చేసిన సంగ‌తి తెలిసిందే. చిన్న నాటి ప్ర‌భాస్ పాత్ర‌లో ఆకాష్ పూరీ..చిన్న‌నాటి త్రిష పాత్ర‌లో ప‌విత్ర పూరీ న‌టించి అల‌రించారు. అయితే ప్ర‌స్తుతం ఆకాష్ పూరీ ఇండ‌స్ట్రీలో హీరోగా కొన‌సాగుతండ‌గా ప‌విత్ర మాత్రం సినిమాల‌కు చాలా దూరంగా ఉంటున్నారు.

అందంతో పాటు అభిన‌యం ఉన్న అమ్మాయిలా ప‌విత్ర క‌నిపిస్తూ ఉంటారు. ఇక ప‌విత్ర ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప‌ర్స‌న‌ల్ మరియు ఇతర అంశాల‌ను షేర్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా పూరీ సినిమాకు సంబంధించిన ఫోటోలు త‌న అన్న ఆకాష్ పూరీ సినిమాల‌కు సంబంధించిన ఫోస్టులు కూడా పెడుతూ ప‌విత్ర నెట్టింట సంద‌డి చేస్తుంటారు. ఇక చూడ్డానికి ఆక‌ట్టుకునే అందం ఉడ‌టంతో ప‌విత్ర పూరీని సినిమాల్లోకి రావాల‌ని పూరీ అభిమానులు కోరుతుంటారు. కానీ ప‌విత్ర ఆ కామెంట్లను పెద్ద‌గా ప‌ట్టించుకోరు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: