టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నసంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.గత ఆరు నెలలుగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన టీమ్ తో కలసి మహేష్, రాజమౌళి సినిమా కథపై కసరత్తులు చేస్తున్నారు.అయితే తాజాగా రాజమౌళి కూడా ఈ స్క్రిప్ట్ లో జాయిన్ అయినట్లు సమాచారం.విజయేంద్ర ప్రసాద్సినిమా కథను ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రాసారు.ఆ ఫారెస్ట్ లో ఉన్న నిధుల గుట్టలపై ఈ సినిమా సాగుతుందట.

అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారు.ఈ క్రమంలో ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి..ప్రత్యర్ధులను చంపుతూ..నిధి వేటకు బయలుదేరుతారు.ఇదే రాజమౌళి మహేష్ కాంబోలో తెరకెక్కే సినిమా కథగా తెలుస్తోంది.ఇక ఆఫ్రికన్ ఫారెస్ట్ లో జరిగే యాక్షన్ అడ్వెంచరస్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయట.ఎలాగూ యాక్షన్ సీన్స్ ను తీయడంలో రాజమౌళి దిట్ట. కాబట్టి సినిమా ఎలా ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పైగా భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సినిమా రాలేదు.

కాబట్టి ఇప్పుడు మహేష్ ఈ సినిమా చేస్తే ఇండియా వైడ్ గా ఈ సినిమాపై ఆసక్తి ఉంటుంది.ఇక తాజాగా ఈ స్క్రిప్ట్ విన్న రాజమౌళి కొన్ని మార్పులు కూడా చెప్పినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా సినిమాకు సంబంధించి ఇంకా రీసెర్చ్ వర్క్ చేయమని చెప్పారట.అంతేకాదు ఆఫ్రికన్ ఫారెస్ట్ లో ఉండే వింత జంతువుల పై కూడా ప్రత్యేక యాక్షన్ సీన్స్ ను రాయమని చెప్పాడట జక్కన్న.ఇక ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళి ఫుల్ క్లారిటీ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందో ఇంకా తెలియాల్సి ఉండగా..ఎప్పటిగాలే ఈ సినిమాను కూడా నేషనల్ వైడ్ గా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: