నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ జక్కన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి, ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత జనతా గ్యారేజ్ డైరెక్టర్ తో మళ్ళీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. తారక్ టాలీవుడ్ లో అగ్ర హీరోగా వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరో, హీరోయిన్లు అన్న తర్వాత ఇండస్ట్రీలో వారిపై రూమర్స్ రావడం చాలా సహజం. తరచూ ఎదో ఒక గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయితే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ఓ లవ్ గాసిప్ టాలీవుడ్ లో తెగ వైరల్ అయిందన్న విషయం మీకు తెలుసా?

అవును అశోక్ సినిమా తెరకెక్కుతున్న సమయంలో ఎన్టీఆర్ ఆ మూవీలోని హీరోయిన్ తో ఆఫ్ స్క్రీన్ కూడా ప్రేమ కురిపిస్తున్నారు అని చాలా వార్తలే వినిపించాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ యాక్టర్ సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అయితే అశోక్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వీరి మధ్య చనువు పెరిగి ప్రేమగా మారిందని వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడిపోయారని ఎన్నో కథనాలు వినిపించాయి. కాగా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు హీరోయిన్ సమీరా రెడ్డి మా మధ్య ఉన్నది స్వఛ్చమైన స్నేహమేనని చెప్పుకొచ్చారు.

అయితే ఓ ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ మాటలు సమీరా రెడ్డిపై తన ప్రేమ రూమర్ నిజమే అనిపించేలా ఉన్నాయంటూ మళ్ళీ వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఇందుకు బాగా హర్ట్ అయిన సమీరా రెడ్డి టాలీవుడ్ లో ఇక చేయకూడదు అని తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కోలీవుడ్, బాలీవుడ్ లలో బిజీ అయిపోయింది. మళ్ళీ చిరు చిత్రం "జై చిరంజీవ" లో  హీరోయిన్ గా చేసింది. ఆ తరవాత మళ్లీ రానా మూవీ "కృష్ణం వందే జగద్గురుం" లో నటించింది. అయితే  అక్షయ్ వార్ధేని అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని  గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరంగా ఉంటున్న సమీరా రెడ్డి. ఇటీవలే తన భర్త పిల్లలతో చేసిన సందడి ఆ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: