టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎలాంటి పాత్రనైనా చేయగల ఎలాంటి నేపథ్యం ఉన్న సినిమాను అయినా చేయగల నటుడు ఎవరైనా ఉన్నారా అంటే వారిలో బాలకృష్ణ కూడా ఒకరు ఉంటారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలు చేసి ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేశాడు బాలకృష్ణ. సాంఘిక పౌరాణిక సామాజిక జానపద ఆధునిక పాత్రలను పోషించి కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ.

సినిమా పూర్తి చేయడానికి గోవాలో శరవేగంగా షూటింగ్ చేస్తూ ఆ పనులలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ చిత్రాన్ని చేయనున్నా డు. యదార్థ సంఘటన ల ఆధారంగా ఈ చిత్రాన్ని చేస్తున్న గోపిచంద్ మరొకసారి క్రాక్ సినిమా తరహాలోనే హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గతంలో ఓ సినిమాలో కురూపి గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. 

ఈ పాటికి మీ అందరికి ఆ సినిమా ఎంటో అన్న విషయం అర్థం అయిపోయి ఉంటుంది. బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా వైవిధ్యభరితమైన చిత్రం భైరవద్వీపం సినిమా ఎప్పటికీ నిలిచి పోతుంది. ఈ సినిమా లో ఆయన రెండు రకాల పాత్రలతో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఒక పాత్ర యువ రాకుమారుడిగా నటించగా మరొక పాత్రలో కురూపి గా నటించాడు. వాస్తవానికి ఈ సినిమాలో బాలయ్య ను కురూపి గా చూసి ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనే భయం వారిలో మొదటి నుంచి ఉందట. చివరికి కథానుసారం వచ్చే ఈ కురూపి గెటప్ ప్రేక్షకులకు చాలా బాగా మెప్పించి సినిమా హిట్ కావడానికి ప్రధాన కారణం అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: