టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. కెరీర్లో ఒకే తరహా సినిమాలు కాకుండా.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ హీరో.. ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటిస్తున్నాడు.బాస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఇక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్ గ్లిమ్స్ తాజాగా విడుదలైంది.

ఇక ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇక డిసెంబర్ 3 న ఈ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్.తాజాగా విడుదల చేసిన టీజర్ లోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.ఇక ఇదిలా ఉంటె టాలీవుడ్ లో తన మొదటి సినిమా నుంచే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నా వరుణ తేజ్.. ఇప్పటికే ఎఫ్2,గద్దల కొండ గగణేష్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని కైవసం చేసుకున్నాడు.ఇక ఈ రెండు భారీ హిట్స్ తర్వాత వరుణ్ తేజ్ నుండి రాబోతున్న చిత్రం 'గని'.

అయితే ఈ సినిమా కనుక విజయం సాధిస్తే.. తన కెరీర్లోనే మొదటి హ్యాట్రిక్ హిట్స్ ని వరుణ్ తేజ్ సొంతం చేసుకుంటాడాని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి వరుణ్ తేజ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ రికార్డును అందుకుంటాడేమో చూడాలి.అయితే గతంలోనే వరుణ్ కి ఓ సారి హ్యాట్రిక్ మిస్సయ్యింది.ఫిదా, తొలిప్రేమ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకొని అంతరిక్షం సినిమాతో ప్లాప్ ని మూటగట్టుకొని హ్యాట్రిక్ ని మిస్ చేసుకున్నాడు.మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు సునీల్ శెట్టి, జగపతిబాబు,కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: