మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున గెలిచిన వారంతా రాజీనామాలు చేశారు. దాంతో వీరు రాజీనామాలు చేసి ఏదైనా తప్పు చేశారా అనే సందేహం ఇప్పుడు కొంతమంది లో నెలకొంది. మా ఎన్నికల సమరం ముగిసినా కూడా మాటల సమరం మాత్రం ఇంకా ముగియలేదు. ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచి అధ్యక్షుడిగా మారిన తరువాత అంతా సద్దుమణుగుతుంది అని అనుకున్నారు కానీ అంతకంతకు వివాదాలు పెరుగుతూ రాజీనామాల పర్వం తెరపైకి వచ్చింది.

మొదట ప్రకాష్ రాజ్ తన మా సభ్యత్వానికి రాజీనామా చేయగా ఆ తర్వాత ఆయన ప్యానెల్ సభ్యులు గెలిచిన వారందరితో కూడా మూకుమ్మడిగా రాజీనామా చేయించాడు. ఈ సందర్భంగా ఆయన ఈ విధంగా చేయడం తప్పు పని అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 950 మంది నిర్ణయాన్ని కాలదన్నుతో ప్రకాష్ రాజ్ ఇలా చేయడం వారు సహించని విషయం గా మారింది.  ఎంత లేదన్నా రెండు వందల ఎనభై మంది దాకా సపోర్ట్ గా నిలిచారు ప్రకాష్ రాజ్ కు. ఆయనను తమ వాడిగా భావించి ఓటు వేశారు. 

అయితే ఆ అందరి ఆశలను అడియాశలు చేస్తూ ప్రకాష్ రాజ్ ఇలా రాజీనామా నిర్ణయం తీసుకోవడం వారందరి నమ్మకాన్ని వొమ్ము చేసినట్లే కదా అని కొంతమంది వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.  దాంతో పాటు అందరితో రాజీనామాలు చేయించడం ఒక్కసారిగా అందరినీ కుదేలు చేసింది. ఈ నేపథ్యంలో గెలుపోటములు సహజం దాన్ని స్వీకరించాలి గెలుపు వస్తే ఎంత ఆనందపడాలో ఓటమి వస్తే అంతే ఈజీ గా తీసుకోవాలి. కానీ ఇలా రాజీనామాలు చేసుకుంటూ పోతే న్యాయం అనేది ఉండదు జరగదు అనేది వారి అభిప్రాయం. మరి మంచు విష్ణు తాజగా పెట్టిన ప్రెస్ మీట్ లో ఈ రాజీనామాలను ఆమోదించనని చెప్పి తన మంచి మనసు చాటుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: