సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు.  సినిమాల్లో హీరోలు చెప్పే డైలాగ్ లను ఎంతో మంది జనాలు ఫాలో అవుతూ ఉంటారు..  కులం మతం లేదని ప్రాంతం వర్గం ఉండకూడదని మనమంతా ఒక్కటే అంటూ సినిమా లో డైలాగులు చెబితే.. అభిమాన హీరో చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తే సినీ సెలబ్రిటీలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇక వాళ్ళ మాటలు నమ్మలేము బాబోయ్ అన్న విధంగానే మారిపోయింది ప్రేక్షకుల భావన. ఎందుకు అంటారా దాని కంతటికీ కారణం ఇటీవల జరిగిన మా ఎన్నికలు. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ సారి మా ఎన్నికలు జరిగాయి అనే విషయం తెలిసిందే.  పొలిటికల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు అయినా అంత హడావిడి ఉంటుందో లేదో తెలియదు కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మాత్రం అంతకుమించిన హడావిడి మధ్య జరిగాయి.  ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం అట్టుడికిపోయింది.  అయితే ఎన్నికల ముందు వరకు ఎంత వేడి ఉన్న.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరో ఒకరు విజేతగా నిలిచిన తర్వాత మాత్రం అంతా సర్దుకుంటుంది అని అనుకున్నారు అందరు. ఇక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేసిన ప్రకాష్ రాజు మంచు విష్ణు ఒకే చోట నిలబడి నవ్వుతూ మాట్లాడుకోవడంతో ఇక వీరి మధ్య ఉన్న విభేదాలు పోతాయని అనుకున్నారు. కానీ ప్రకాష్ రాజు మాత్రం ఓటమి జీర్ణించుకోలేకపోతున్నారు అన్నది అర్ధమవుతుంది.  దీంతో కొత్త అసోసియేషన్ అంటూ ప్రస్తుతం ప్రచారం జరుగుతూనే ఉంది. దీంతో ప్రకాష్ రాజు చేస్తున్నవి సినీ ప్రేక్షకులకు సినీ సెలబ్రిటీల పై విరక్తి తెప్పిస్తున్నాయి.  అందరికీ  ఆదర్శంగా నిలిచే సెలబ్రిటీలు ఇప్పుడు ఏంటీ ఇలా దారుణంగా రోడ్డు మీదికి వచ్చేస్తున్నారు అని అనుకుంటున్నారు అందరు.  అయితే ఓడిపోయిన తర్వాత అందరితో కలిసి ఉండకుండా ప్రకాష్ రాజు సరి కొత్త విషయాలను ఎందుకు తెర మీదకు వస్తున్నారు. ఇన్ని డ్రామాలు ఎవరి మెప్పు పొందేందుకు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: