మా ఎన్నిక‌లు ముగిశాయి. మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ ఉంద‌ని చెప్పుకున్న లేదా ప్ర‌చారం జ‌రిగిన ప్ర‌కాష్ రాజ్ ఓడిపోయారు. ఇలాంట‌ప్పుడు ఏం చేయాలి.. మా లో గ‌తం నుంచి వ‌స్తోన్న సంప్ర‌దాయాలే కొన‌సాగేలా చేయాలి. కానీ ఇప్పుడు మా లో పెద్ద‌లు .. ఇంకా చెప్పాలంటే ఓడిన వారు.. వాళ్ల‌కు స‌పోర్ట్ చేసిన వారు నైతిక విలువ‌లు గాలికి వ‌దిలేసిన ప‌రిస్థితే క‌నిపిస్తోంది.

ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌కాష్ రాజ్ కోసం నాగ‌బాబు చేసిన ప్ర‌చారం.. మెగా వ‌ర్గంగా చెప్పుకునే శ్రీకాంత్ లాంటి హీరోలు చెప్పిన మాట‌లు.. చివ‌ర‌కు నాగ‌బాబు దిగ‌జారి కోట శ్రీనివాస‌రావు లాంటి న‌టుల‌ను అన్న మాట‌లు ఎవ్వ‌రు మాత్రం మ‌ర్చిపోతారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో ఓడిపోయాక మెగా కాంపౌండ్ ప‌నై పోయింద‌న్న టాక్ రావ‌డంతో వీరు ఓట‌మి ని జీర్ణించు కోలేక రాజీనామాల డ్రామాల‌కు తెర‌లేపార న్న విమ‌ర్శ‌లు ఈ రోజు తీవ్రంగా వ‌స్తున్నాయి.

మా ఎన్నిక‌లు అయ్యాక నాగబాబు మా ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేయడం, ప్రకాష్ రాజ్ రాజీనామా చేయడం తో పాటు త‌మ ఫ్యానెల్ నుంచి గెలిచిన మెంబర్స్ కూడా రాజీనామా చేయడం చూస్తుంటే మెగా పరార్ అన్న సెటైర్లే ప‌డుతున్నాయి. చివ‌ర‌కు వీరిని న‌మ్మి గెలిపించి ఓట్లేసిన వారిని గాలికి వ‌దిలేసి ఇలా పారీ పోవ‌డం అనేది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి.

మా ఎన్నిక‌ల‌కు ముందు.. ఆ త‌ర్వాత కూడా ఇంత జరుగుతుంటే వీళ్ల ను కంట్రోల్ చేసే బాధ్య‌త అయినా కనీసం చిరంజీ వి తీసు కోవాల్సింది క‌దా ? అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఏదేమైనా మెగా ఫ్యామిలీ కీల‌క విష‌యాల్లో .. ఇంకా చెప్పాలంటే నాడు చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ ఓడిపోయాక త‌నను న‌మ్ముకున్న వాళ్ల‌ను గాలికి వ‌దిలేశార‌న్న విమ‌ర్శ ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా మా భ‌విష్య‌త్తు కంటే వారి ప‌ట్టింపుల‌తో వారిని న‌మ్ముకున్న మా సభ్యుల‌ను గాలికి వ‌దిలేశార‌ని మ‌రో సారి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: