మా అర్టిస్ట్‌ అసోయేషన్‌ ఎన్నికల వేడి ఏ మాత్రం తగ్గటం లేదు.  మా అర్టిస్ట్‌ అసోయేషన్‌ ఎన్నికల హడావిడీ పూర్తి అయి దాదాపు రెండు రోజులు గడుస్తున్నా... టాలీవుడు నటులు ఒకరిపై మరోకరు దుమ్మెత్తి పోసుకుంటునే ఉన్నారు. ఏ ఒక్కరూ తగ్గడం లేదు.  వరుసగా ప్రెస్‌ మీట్లు పెట్టి రెచ్చి పోతున్నారు  మా అర్టిస్ట్‌ అసోయేషన్‌  సభ్యులు.  ఇక తాజాగా మా అర్టిస్ట్‌ అసోయేషన్‌  మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు నరేష్‌... ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ పై ఓ రేంజ్‌ లో కామెంట్‌ చేశాడు. నిన్న ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు... ఆయనను టార్గెట్‌ చేసిన నేపథ్యంలోనే... స్వయంగా నరేష్‌... రంగంలోకి దిగి.. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చేశారు.  

కలిసి పనిచేస్తాం అన్న వాళ్ళు... ఎందుకు రిజైన్ చేశారని....  బయట ఉండి ప్రశ్నించడం ఏంటి...? అని నిప్పులు చెరిగారు నటుడు నరేష్‌. దేశ ప్రధాని గా మోడీ గెలిచాడు అని... కాంగ్రెస్  పార్టీ వాళ్లు భారత దేశం వదిలి వెళ్ళ లేదు కదా..! మీ రేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం తో ఊగి పోయారు నరేష్‌.    మా అర్టిస్ట్‌ అసోయేషన్‌ అనేది కుటుంబమని.... గెస్ట్ గా వచ్చిన వాళ్లే ఇది కుటుంబం కాదు అంటారని ఫైర్‌ అయ్యారు నరేష్‌.  

ఫ్యాక్షనిజం మానేద్దాం... కలిసి పనిచేద్దామని పిలుపు నిచ్చారు నరేష్‌. ప్రమాణ స్వీకారం త్వరలో ప్రకటిస్తామని..... ఇవాళ నేను ఛార్జ్ విష్ణు కి ఇచ్చానని స్పష్టం చేశారు నరేష్. విష్ణు ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే... బాగోదని... ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి అని పేర్కొన్నారు. ఎమోషన్స్.. ఫ్రస్ట్రేషన్... వద్దు... నేను పేర్లు చెప్పదలుచుకోలేదు... కానీ.. గెలిచాక కూడా ఆరోపణలు చేయడం ఏంటి ? అని ఆగ్రహించారు నరేష్‌. రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ గురించి కొత్త ప్యానల్ చూసుకుంటుందని కుండ బద్దలు కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: