నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' సంచలనం సృష్టిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేస్తోంది. విడుదలైన 25 రోజుల్లోనే దీనిని 111 మిలియన్ల మంది వీక్షించారు. అక్టోబర్ 12 న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన 'గేమ్ స్క్విడ్' అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్‌ అని అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. ఈ కొరియన్ వెబ్ సిరీస్‌లోని అన్ని పాత్రలు ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వెబ్ సిరీస్ ఇంత తక్కువ సమయంలో ఇంత ప్రజాదరణ పొందడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో చాలా ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి.

అక్టోబర్ 3 న ఈ సిరీస్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో 'స్క్విడ్ గేమ్' ఫేమ్ జంగ్ హో యియోన్ ఫాలోవర్ల సంఖ్య 12.6 మిలియన్లు దాటింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో ఈ సిరీస్ ను ప్రజలు ఆదరిస్తున్నారో. జంగ్ హో ఇయాన్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న కొరియన్ నటిగా మారింది. 'స్క్విడ్ గేమ్' నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. 'స్క్విడ్ గేమ్' విడుదలకు ముందు అందులోని రెండు ప్రధాన పాత్రధారులు లీ జంగ్ జే, పార్క్ హే సూ లకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలే లేవు. కానీ స్క్విడ్ గేమ్ విడుదలైన తర్వాత అతను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచిన వెంటనే ఫాలోవర్ల సంఖ్య మిలియన్లకు చేరుకుంది.  

కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' 17 సెప్టెంబర్ 2021 న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ 9 ఎపిసోడ్ ఆ వెబ్ సిరీస్ ఓ ఆటలో తమ జీవితాల ను పణంగా పెట్టి 45.6 బిలియన్లు లేదా దాదాపు 38.7 మిలియన్ డాలర్ల డబ్బు గెలుచుకున్న కథ.

మరింత సమాచారం తెలుసుకోండి: