నందమూరి బాలక్రిష్ణ డైరీ చూస్తే చాలు ఆయన ఎంత బిజీ గా ఉన్నారో అర్ధమవుతుంది. బాలయ్యది సుదీర్ఘమైన కెరీర్. ఆయన ఏ రోజూ కూడా షూటింగ్ లేకుండా ఖాళీగా కూర్చోలేదు. ఇపుడు కూడా బాలయ్య చేతిలో మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి.


ఇంకా మరికొన్ని వెయిటింగ్ ఓ ఉన్నాయి. బాలయ్య ప్రస్తుతం  అఖండ షూటింగ్ పూర్తి చేశారు. క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో కొత్త సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూట్ ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతుంది అంటున్నారు. దీని తరువాత అనిల్ రావిపూది మూవీలో బాలయ్య కొత్త ఏడాది నుంచి జాయిన్ అవుతారు అని కూడా టాక్ ఉంది.


అయితే ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. అదెలా అంటే బాలయ్యతో మూవీ చేయాల్సిన అనిల్ రావిపూడికి మోక్షజ్ఞ డెబ్యూ మూవీని అప్పగించాలని చూస్తున్నారుట. తనతో కంటే కొడుకుతో అనిల్ మూవీ చేయడం బెటర్ అని బాలయ్య ఫిక్స్ అయ్యారని అంటున్నారు. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ చూస్తే చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లే. అయితే అనిల్ ఫస్ట్ మూవీ నుంచి కూడా ఎపుడెపుడు బాలయ్యతో సినిమా చేయాలి అని ఆలోచిస్తూనే ఉన్నారు.


ఎట్టకేలకు ఆయన కోరిక తీరుతుంది అనుకుంటున్న టైమ్ లో తనతో కాదు కొడుకు మోక్షజ్ఞతో సినిమా చేయాలని బాలయ్య అడుగుతున్నట్లుగా ప్రచారం అయితే ఉంది. మోక్షజ్ఞ మూవీ లాంచ్ కి ఇప్పటికే బాగా లేట్ అయింది. 2022లో అయినా ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిందే అన్న పట్టుదలతో బాలయ్య ఉన్నారని అంటున్నారు. ఎందరో డైరెక్టర్లను చూసిన ఆయనకు అనిల్ రావిపూడి ది బెస్ట్ గా కనిపించాడుట. దాంతో తనతో చేయాల్సిన మూవీని కొడుకు కోసం వదిలేసుకున్నారని టాక్. మరి ఇదే కనుక నిజమైతే బాలయ్య ఫ్యాన్స్ హుషార్ కి ఆకాశమే హద్దు అనాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: