ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుని ఒక్కో సినిమా తో నటిగా ఆడియన్స్ ని అలానే తన అభిమానులని అలరిస్తూ కొనసాగుతున్న యువ భామ పూజా హెగ్డే నేడు తన జన్మదినాన్ని ఎంతో వైభవంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైం టాలీవుడ్ కి నాగ చైతన్య హీరోగా విజయ్ కుమార్ తీసిన ఒకలైలా కోసం మూవీ ద్వారా ఎంటర్ అయిన పూజాసినిమా ద్వారా విజయాన్ని అందుకున్నారు. అనంతరం వరుణ్ తేజ్ తో ఆమె చేసిన ముకుందా మూవీ ఫెయిల్ అయింది. ఆ తరువాత అల్లు అర్జున్ తో డీజే మూవీ చేసారు పూజా.

హరీష్ శంకర్ తీసిన ఆ సినిమా ఎబోవ్ యావరేజ్ గా ఆడింది. అయితే ఆ తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అరవింద సమేత మూవీ సూపర్ హిట్, కెరీర్ పరంగా పూజా కి సూపర్ బ్రేక్ నిచ్చింది. ఆపైన మహేష్ తో మహర్షి, వరుణ్ తేజ్ తో గడ్డలకొండ గణేష్, అలానే అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో వంటి సినిమాలు చేసి వాటితో కూడా సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న పూజా త్వరలో మరొక్కసారి మహేష్ తో యాక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యామ్ అలానే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేస్తున్న పూజా నేడు మరొక బడా టాలీవుడ్ అఫర్ ని కైవశం చేసుకున్నట్లు చెప్తున్నారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ మూవీ ఒక స్టార్ హేరోది అని, త్వరలో దానికి సంబంధించి పూర్తిగా అఫీషియల్ న్యూస్ బయటకు రానుందని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం అటు తమిళ్ లో విజయ్ తో బెస్ట్ సినిమా కూడా చేస్తున్న పూజా ఈ విధంగా నటిగా ఒక్కొక్కటిగా బడా ఛాన్స్ లతో దూసుకుపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: