అయితే ఇప్పుడు మహేష్ బాబు అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల మాట. మహేష్ బాబు ఇటీవల భుజం సమస్యతో బాధపడుతున్నారని దీనికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకునేందుకు మహేష్ బాబు వెళ్లే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు దీనిపై ఇప్పటికే తాను చేస్తున్న సినిమా దర్శకుడు కూడా మహేష్ బాబు చర్చించారని ఆ సినిమా పూర్తయిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలకు తాను కొన్ని రోజులు దూరంగా ఉంటాను అని కూడా మహేష్ బాబు చెప్పారని అంటున్నారు.
సమస్య మరింత తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే మహేష్ బాబు అమెరికా వెళుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు రామ్ చరణ్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథ కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసి ఉంచారు అనేది త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని టాలీవుడ్ వర్గాల మాట.