టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలకు కొరటాల శివ పెట్టింది పేరు అనే విషయం అందరికీ తెలిసిందే. కొరటాల శివ చేస్తున్న సినిమాలో అన్నీ కూడా కమర్షియల్ గా ఉండటం అదేవిధంగా అగ్రహీరోతో చేసిన సినిమాలన్నీ భారీ విజయాలు సాధించడంతో ఆయన విషయంలో చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. మొదటి సినిమా నుంచి ప్రస్తుతం చిరంజీవి తో చేస్తున్న సినిమా వరకు కొరటాల శివ కమర్షియల్ సినిమాలను నమ్ముకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ చేస్తున్న సినిమా పూర్తి కావడంతో తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు రెడీ అయి దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు.

ఇది పక్కన పెడితే ఇప్పుడు కొరటాల శివకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పు సంఘటన ఒకటి టాలీవుడ్ లో హైలెట్ అవుతుంది. ఇటీవల ఒక పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరైన కొరటాల శివతో... మహేష్ బాబు చర్చలు జరిపారని రాజమౌళితో సినిమా తర్వాత ఆ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారని దానికి సంబంధించిన కథను సిద్ధం చేయాల్సిందిగా కొరటాల శివ మహేష్ బాబు త్వరగా... తాను అల్లు అర్జున్ తో చేసే సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమాను ప్లాన్ చేశాం అని కొరటాల శివ చెప్పినట్టుగా తెలిసిందే.

2025 నాటికి ఈ సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ గా ఉండాలని కూడా కొరటాల శివకు మహేష్ బాబు చెప్పాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. కొరటాల శివ ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తనకి ఇచ్చిన నేపథ్యంలో ఏ రేంజిలో విజయం సాధిస్తుంది ఏంటనే దానిపై టాలీవుడ్ వర్గాలు అన్ని కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: